AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే..

విదేశీ పర్యటన అంటే భారీగా డబ్బు ఖర్చవుతుందని చాలామంది భావిస్తారు. అయితే సరైన గమ్యస్థానాన్ని ఎంచుకుని, ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే ఇంటర్నేషనల్ ట్రిప్ పూర్తి చేయవచ్చు. తాజాగా కంటెంట్ క్రియేటర్ పలక్ దావ్డా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వివరాల ప్రకారం.. సుమారు రూ.50,000 బడ్జెట్‌లో 4 నుంచి 5 రోజుల పాటు సందర్శించగల ఏడు దేశాలు ఉన్నాయి. అయితే విమాన టికెట్లు, వీసా, సీజన్, వ్యక్తిగత ఖర్చులను బట్టి వాస్తవ వ్యయం మారవచ్చు.

Phani CH
|

Updated on: Sep 01, 2026 | 8:14 PM

Share
అల్మాటీ.. వీసా లేకుండానే. కజకిస్థాన్‌లోని అల్మాటీ బడ్జెట్ ట్రావెలర్లకు ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది. భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం లేదని పలక్ దావ్డా తెలిపారు. ఇక్కడ హోటల్ బసకు రాత్రికి సుమారు రూ.2,500, ఆహారానికి రోజుకు రూ.1,500 వరకు ఖర్చవుతుందని అంచనా. రానుపోను విమాన టికెట్లకు సుమారు రూ.20,000, ఇతర స్థానిక ఖర్చులకు రోజుకు రూ.3,000 వరకు అవసరం కావచ్చు.

1 / 7
శ్రీలంక.. శ్రీలంక కూడా తక్కువ బడ్జెట్‌లో విదేశీ పర్యటనకు అనుకూలమైన గమ్యస్థానంగా ఉంది. భారతీయులకు వీసా అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. బసకు రాత్రికి రూ.2,500, ఆహారానికి రోజుకు రూ.1,500 వరకు ఖర్చు కావచ్చు. రానుపోను విమాన ప్రయాణానికి సుమారు రూ.18,000, స్థానిక పర్యటనలకు రోజుకు రూ.3,000 వరకు ఖర్చవుతుందని అంచనా.

2 / 7
మలేషియా.. మలేషియాను కూడా ఈ జాబితాలో చేర్చారు. బసకు రాత్రికి రూ.2,000, ఆహారానికి రోజుకు రూ.1,200 వరకు ఖర్చు కావచ్చు. రానుపోను విమాన టికెట్లకు సుమారు రూ.18,000, ఇతర రోజువారీ ఖర్చులకు రూ.2,000 వరకు అవసరం కావచ్చని తెలిపారు.

3 / 7
భూటాన్.. భూటాన్ వెళ్లేందుకు ప్రత్యేక విమాన ప్రయాణం తప్పనిసరి కాదు. బాగ్డోగ్రా విమానాశ్రయం నుంచి టాక్సీ ద్వారా భూటాన్ సరిహద్దుకు చేరుకోవచ్చు. రోజువారీ వీసా రుసుము సుమారు రూ.1,200గా ఉండగా, వసతికి రూ.3,000, ఆహారానికి రూ.1,200 వరకు ఖర్చు కావచ్చు. డే టూర్లకు రోజుకు రూ.3,000 వరకు అవసరం కావచ్చు.

4 / 7
ఒమన్.. ఒమన్‌కు ఇ-వీసా కోసం సుమారు రూ.1,700 ఖర్చవుతుందని అంచనా. వసతికి రాత్రికి రూ.3,000, ఆహారానికి రోజుకు రూ.1,500, రానుపోను విమాన టికెట్లకు సుమారు రూ.15,000 అవసరం కావచ్చు. స్థానిక పర్యటనలకు రోజుకు రూ.3,000 వరకు ఖర్చు కావచ్చని తెలిపారు.

5 / 7
కంబోడియా.. కంబోడియాలో విమానాశ్రయంలోనే వీసా పొందే అవకాశం ఉందని పలక్ దావ్డా తెలిపారు. ఇందుకు సుమారు రూ.2,700 ఖర్చు కావచ్చు. హోటల్‌కు రాత్రికి రూ.2,000, ఆహారానికి రోజుకు రూ.1,200 వరకు ఖర్చు కావచ్చు. రానుపోను విమాన ప్రయాణానికి సుమారు రూ.23,000, డే టూర్లకు రోజుకు రూ.2,500 వరకు అవసరం కావచ్చు.

6 / 7
థాయ్‌లాండ్.. థాయ్‌లాండ్ కూడా ఈ జాబితాలో ఉంది. భారతీయులకు వీసా అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. వసతికి రాత్రికి రూ.2,000, ఆహారానికి రోజుకు రూ.1,200 వరకు ఖర్చవుతుందని అంచనా. రానుపోను విమాన ప్రయాణానికి సుమారు రూ.15,000, స్థానిక పర్యటనలకు రోజుకు రూ.2,000 వరకు ఖర్చు కావచ్చు.

7 / 7
Follow Us