
డబ్బు బాగా రావాలని కోరుకునే వాళ్లు ప్రతిరోజూ స్నానం చేశాక.. శుద్ధమైన మనసుతో శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. పూలతో, దీపంతో, నైవేద్యంతో ఆమెను ప్రసన్నం చేసుకోవడం వల్ల.. శాంతి, ఐశ్వర్యం, మంచి జరుగుతాయని వేదాలు చెబుతున్నాయి. ఆ అమ్మవారు అనుగ్రహిస్తే జీవితంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.

శ్రీ మహాలక్ష్మికి వాహనంగా భావించే గుడ్లగూబ అనుకోకుండా ఇంటి దగ్గర కనిపిస్తే.. అది డబ్బు లాభానికి సంకేతంగా చూడొచ్చు. ఇది అజ్ఞానాన్ని పోగొట్టి సంపదను ఆకర్షించే మంచి సైన్ గా భావిస్తారు.

ఉదయం లేదా సాయంత్రం శంఖం శబ్దం వినిపిస్తే.. అది ఆర్థికంగా ఎదుగుదల జరగబోతుందని సూచించవచ్చు. శంఖం సముద్ర మథనం సమయంలో వచ్చిన పవిత్ర వస్తువు. అందుకే ఇది శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమైనదిగా, పూజల్లో ముఖ్యమైనదిగా ఉంటుంది.

భారతీయ సంప్రదాయాల్లో పిచ్చుకను శుభానికి, మంచికి, తెలివితేటలకు గుర్తుగా చూస్తారు. ఏ ఇంట్లోనైనా పిచ్చుక వచ్చి కూర్చుంటే.. అది ఆ ఇంటి వాళ్లపై లక్ష్మీదేవి దయ కురుస్తుందని నమ్ముతారు.

కలల్లో కమలం పువ్వు కనిపిస్తే.. అది డబ్బు, శాంతి, విజయం రాబోతున్నాయని చెబుతుంది. కమలం మహాలక్ష్మికి చాలా ఇష్టమైన పువ్వు. అందుకే ఈ పువ్వు కలలో కనిపిస్తే మంచి సంకేతంగా భావిస్తారు.