
సోలార్ ఛార్జర్: మీరు బయట ఉండి సూర్యరశ్మి బాగా ఉన్నట్లయితే, సోలార్ ఛార్జర్ బెస్ట్ ఆప్షన్. ఈ ఛార్జర్‌లు సూర్యుడి నుండి శక్తిని గ్రహించి మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తాయి. సోలార్ ఛార్జర్‌ను సూర్యకాంతిలో ఉంచి, యూఎస్‌బీ కేబుల్ ద్వారా ఫోన్‌ను కనెక్ట్ చేస్తే చాలు, సూర్యుడు ప్రకాశిస్తున్నంత సేపు ఛార్జింగ్ కొనసాగుతుంది.

హ్యాండ్-క్రాంక్ ఛార్జర్: విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌ను ప్లగ్ చేసి హ్యాండిల్‌ను తిప్పడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీంతో మీ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది.

కార్ ఛార్జర్: మీకు కారు ఉంటే రోడ్డు ప్రయాణాల సమయంలో కార్ ఛార్జర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఛార్జర్‌లు కారులోని పవర్ అవుట్‌లెట్‌లోకి ప్లగ్ చేయబడతాయి. కారు ఇంజిన్ ఆన్‌లో ఉన్నంత వరకు, మీ ఫోన్ సులభంగా ఛార్జ్ అవుతుంది.

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు: విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మాల్స్ లేదా రవాణా కేంద్రాల వద్ద పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్స్ లేదా ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లు లభిస్తాయి. అయితే రద్దీ సమయాల్లో ఇవి దొరకడం కష్టంగా ఉండవచ్చు.

యూఎస్‌బీ పోర్ట్: మీరు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేదా కాఫీ షాపులు, హోటళ్ళు వంటి బహిరంగ ప్రదేశాలలో సులభంగా లభించేయూ యూఎస్‌బీ పోర్ట్‌లను ఉపయోగించి మీ ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. మీ యూఎస్‌బీ కేబుల్‌ను కంప్యూటర్ పోర్ట్‌కు లేదా అందుబాటులో ఉన్న ఏదైనా యూఎస్‌బీ పోర్ట్‌కు కనెక్ట్ చేసి మీ ఫోన్‌కు ఛార్జింగ్ చేసుకోవచ్చు.