Pet Dog Viral Video: ఈ పెంపుడు కుక్క తెలివికి హ్యాట్సాప్ చెబుతున్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరూ వావ్ అంటారు..

Pet Dog Viral Video: కొన్ని శునకాలకు చాలా తెలివి ఉంటుంది. అవి చేసే పనులు ఎంతో ఆకట్టుకుంటాయి. అదే సమయంలో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నాయి.

Pet Dog Viral Video: ఈ పెంపుడు కుక్క తెలివికి హ్యాట్సాప్ చెబుతున్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరూ వావ్ అంటారు..
Pet Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 15, 2021 | 5:56 PM

Pet Dog Viral Video: కొన్ని శునకాలకు చాలా తెలివి ఉంటుంది. అవి చేసే పనులు ఎంతో ఆకట్టుకుంటాయి. అదే సమయంలో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నాయి. నవ్వు కూడా తెప్పిస్తాయి. ఇలాంటి సోషల్ మీడియాలో కోకొల్లలు. అయితే, తాజాగా ఓ కుక్క చేసిన పనికి సంబంధించిన వీడియోలో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూస్తే ఆ కుక్క చేసిన పనికి శభాష్ అనక మానరు. ట్వి్ట్టర్ యూజర్ డానీ డెరానీ షేర్ చేసిన ఈ వీడియోలో పెంపుడు కుక్క చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఇంటి యజమాని కొడుకు(పసిపిల్లాడు) మెట్ల పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే వచ్చిన పెంపుడు కుక్క.. అతని కంటే ముంద పై మెట్టుపై కూర్చుంది. చిన్నారి ఆ మెట్లు ఎక్కే ప్రయత్నం చేసిన ప్రతీసారి అతన్ని నిలువరిస్తుంది. అయినా వెనక్కి తగ్గని బుడ్డోడు మరోసారి మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాడు. మరి కుక్క ఊరుకుందా? అంటే అస్సలు తగ్గేదే లేదన్నట్లు.. బాలుడిని అడ్డగించింది.

అలా పిల్లవాడు మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించడం.. కుక్క అడ్డుకోవడం.. వరుసగా జరుగడంతో ఆ బాలుడు విసిగిపోయి.. అటూ ఇటూ చూసి మరోవైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అలా మెట్లపైకి ఎక్కి కిందపడే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన ఆ కుక్క.. ఇలా బాలుడిని మెట్లు ఎక్కకుండా నిలువరించింది. ఈ వీడియో డానీ డెరానీ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించారు. పలురువురు నెటిజన్లు ఆ కుక్క తెలివిని ప్రశంసిస్తున్నారు. ‘ఆ కుక్క తెలివితేటలు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలుడు మెట్లు ఎక్కితే కింద పడే ప్రమాదం ఉందని కుక్క ముందే గ్రహించడం అద్భుతం. అసలు అలా ఎలా గ్రహించగలిగింది.’ అని ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Viral Video:

Also read:

Viral Video: అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే