Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadaknath Chicken: కడక్‌నాథ్ చికెన్‌కు పెరుగుతున్న డిమాండ్.. హైదరాబాద్‌లో కేజీ ధర ఎంతంటే..?

నాటుకోడి మాంసానికి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే..ఈ క్రమంలో నాటు కోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

Kadaknath Chicken: కడక్‌నాథ్ చికెన్‌కు పెరుగుతున్న డిమాండ్.. హైదరాబాద్‌లో కేజీ ధర ఎంతంటే..?
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Mar 03, 2021 | 12:22 PM

Kadaknath Chicken:  నాటుకోడి మాంసానికి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే..ఈ క్రమంలో నాటు కోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ కోడి మాంసం కిలో వెయ్యి నుంచి 12వందల వరకు ఉంటుంది. అమ్మో అంత ఖరీదా?…ఏంటి దీని స్పెషాలిటీ అని ఆశ్చర్యపోతున్నారా…అప్పుడే అయిపోలేదు…ఈ కోడి పేరు,రూపం దగ్గర్నుంచి అన్నీ స్పెషలేనట! అందుకే హైదరాబాదులో ఈ చికెన్‌ కిలో 1000 నుంచి రూ 1200 వరకు పలుకుతోంది.

ఇవే…కడక్‌నాథ్‌ కోళ్లు…ఈ చికెన్ నిజంగానే చాలా హాట్. కడక్‌నాథ్ కోడి మాంసం నల్లటి రంగులో ఉంటుంది. కోడి కూడా ఇదే రంగులో ఉంటుంది. అయితే కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అతి తక్కువగా క్రొవ్వు పదార్థం ఉంటుంది. మంచి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధరీ భారీగా పలుకుతోంది. దీనికోసం వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు మాంసాహార ప్రియులు.  ఇక బతికున్న కోడి కిలో రూ.800 వరకు పలుకుతోంది.

సాధారణంగా కడక్‌నాథ్ బ్రీడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది.ఈ కోడి మొత్తం నలుపురంగులోనే ఉంటుంది. దీని గుడ్లు కూడా నల్లగా ఉంటాయనే ప్రచారం ఉన్నప్పటికీ వాస్తవానికి అవి కాస్త కాఫీరంగుతో పాటు కొంత పింక్ కలర్‌లో ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్లను మాంసం కోసం గుడ్లు కోసం పెంచుతారు.

టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్లు బిజినెస్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాక కడక్‌నాథ్ చికెన్‌కు బాగా ప్రాచూర్యం లభించింది. వాటి గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేయడంతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ పాలి టేస్ట్ చేసేయ్యండి.

Also Read:

సినిమా షూటింగ్‌‌లో పేలిన పెట్రోల్ బాంబులు.. ప్రముఖ హీరోకు గాయాలు

యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!