అతడిది ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం.. 39 మంది భార్యలు.. మొత్తం సభ్యులు ఎంతమందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

May 20, 2021 | 4:41 PM

చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం.. ఈ సామేత వినే ఉంటారు. ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబంలో ఆర్థిక సమస్యలు.. కుటుంబ భారం ఎక్కువగా ఉంటుందని..

అతడిది ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం.. 39 మంది భార్యలు.. మొత్తం సభ్యులు ఎంతమందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Ziona Chana
Follow us on

చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం.. ఈ సామేత వినే ఉంటారు. ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబంలో ఆర్థిక సమస్యలు.. కుటుంబ భారం ఎక్కువగా ఉంటుందని..అలాగే మానసిక ఒత్తిడి ఉంటుందని చెబుతుంటారు. అందుకు తల్లిదండ్రులు.. వారికి ఇద్దరు పిల్లలు ఇలా చిన్న కుటుంబం ఉండడం వలన సంతోషంగా గడిపేస్తారని అంటుంటారు. ఇక మన భారత దేశంలో ఉమ్మడి కుటుంబాల గురించి తెలిసిందే. పూర్వం రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. క్రమంగా మారుతున్న కాలానుగుణంగా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. ఒకే చోట ఉండకుండా.. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వ్యక్తి కుటుంబం గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అతడిది ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం.. వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిపితే ఒక గ్రామంలో ఉండే ప్రజలకు సమానంగా ఉంటుంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది వాస్తవం. ఆ కుటుంబం ఇప్పటికీ ఉమ్మడిగానే.. ఒకే ఇంట్లో చాలా సంతోషంగా నివసిస్తున్నారు. ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకుందామా..

మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో ఓ కుటుంబం దాదాపు 100 గదులతో కూడిన ఇంట్లో నివసిస్తోంది. ఆ కుటుంబం పెద్ద జియోనా చనా. అతడి వయసు 76 సంవత్సరాలు. అతడికి 39 మంది భార్యలు.. 94 మంది పిల్లలు.. 14 మంది కుమార్తెలు.. 33 మంది మనవరాళ్లు.. ఒక మనవడు ఉన్నారు. జియోనా వృత్తి రీత్యా వడ్రంగి. ఇదిలా ఉంటే.. ఈ కుటుంబంలోని వ్యక్తులందరూ.. ఒకరిపై ఒకరు ఆధారపడరు. ఎవరి అవసరాలకు వారే పనులు చేసుకుంటారు. జియోనాకు పెద్ద మొత్తంలో సాగు భూమి ఉంది. ఇక్కడ జియోనా కుటుంబ సభ్యులు ఆహార ధాన్యాలు.. కూరగాయలు, పండ్లను పండిస్తారు. ఇవే కాకుండా.. కోడి గుడ్ల వినియోగం చేసేందుకు సొంతంగా ఫౌల్ట్రీఫాం ను కూడా నిర్వహిస్తున్నారు.

వీరి కుటుంబంలో మొత్తం 181 మంది సభ్యులు ఉన్నారు. కానీ కుటుంబ పోషన, ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది పడరు. ఇక వారందరూ కూడా జియోనా ఆదేశాలను కచ్చితంగా పాటిస్తారు. ఇప్పటికీ ఆ కుటుంబం మొత్తం పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. వీరందరూ.. వ్యవసాయం.. ఇతర పనులు చేస్తుంటారు. ఇక జియోనా పెద్ద భార్య.. ఆ కుటుంబం మొత్తానికి అధిపతిగా వ్యవహరిస్తుంది. 181 మంది సభ్యులు ఉన్న ఆ కుటుంబం రోజుకూ 45 కిలోల బియ్యం, 25 కిలోల పప్పులు, 60 కూరగాయలు, 20 కిలోల పండ్లు, 30-40 కోళ్ళు, డజన్ల కొద్దీ గుడ్లు తింటారు. జియోనా పెద్ద కొడుకు వయసు 52 సంవత్సరాలు. అతని పేరు పార్లియానా. తన కుటుంబంలో అనేక రకాల తెగలకు చెందిన సభ్యులున్నారని.. తన తండ్రి పేద, అనాథ మహిళలను వివాహం చేసుకున్నాడని పార్లియానా చెప్పారు.

Also Read: Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..