Viral: ఆశ్చర్యం.. బుజ్జి బుజ్జి గుడ్లు పెడుతున్న కోడి.. ద్రాక్ష పండంతే..

|

Jan 06, 2022 | 5:30 PM

ఈ బుజ్జి.. బుజ్జి గుడ్లను చూస్తే మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ డౌట్స్ క్లారిఫై చేయాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Viral: ఆశ్చర్యం.. బుజ్జి బుజ్జి గుడ్లు పెడుతున్న కోడి.. ద్రాక్ష పండంతే..
Small Eggs
Follow us on

‘అదేంటి కోడి గుడ్డు పక్కన.. చిన్న, చిన్న గుడ్లు ఉన్నాయి..?’ లేదా.. ‘వేరే పక్షి గుడ్లను కోడితో పొదిగిస్తున్నారా ‘… ‘ఏమైనా క్రాస్ బ్రీడింగ్ జరుగుతుందా’ అనుకోకండి. అవి కోడి పెట్టిన గుడ్లే. యస్.. కేరళ మలప్పురంలోని ఏఆర్​ నగర్ ప్రాంతానికి చెందిన సమద్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఐదేళ్ల వయసు ఉన్న కోడిపెట్ట ఇలా బుజ్జి.. బుజ్జి గుడ్లు పెడుతోంది. అవి ద్రాక్ష పండంత సైజులో ఉంటున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆ బుజ్జి గుడ్లలో తెల్లసొన మాత్రమే ఉంది. పచ్చసొన కనిపించడం లేదు.  కాగా అంతకుముందు బాగానే గుడ్లు పెట్టిన సదరు కోడి..  కొద్దిరోజులుగా ఇలా చాలా చిన్న సైజులో గుడ్లను పెడుతోందట. ఇప్పటివరకు తమ కోడి మొత్తం 9 చిన్న గుడ్లను పెట్టిందని ఆ కోడి యజమాని తెలిపాడు. ఈ బుజ్జి గుడ్ల ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దాంతో వీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది సమద్​ ఇంటికి వస్తున్నారు.

ఆకుపచ్చ సొన గుడ్లను చూశారా..?

కాగా కేరళలోని ఒతుక్కుంగల్‌లో ఉన్న ఓ ఫాంలోని ఆరు కోళ్లు ఆకుపచ్చసొనతో ఉన్న కోడిగుడ్లను మాత్రమే పెడుతున్నాయి. ఈ విచిత్రమైన కోడి గుడ్ల ఫోటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ గుడ్లన పొదిగిస్తే చక్కగా.. ఆరోగ్యవంతమైన కోడిపిల్లలు కూడా బయటకు వచ్చాయి.

Also Read: కామపిశాచిలా మారిన మామ.. కోడలిపైనే కన్ను.. మాట వినకపోవడంతో

భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..