Chameleon: ఊసరవెల్లి దాని రంగును ఎప్పుడు, ఎలా, ఎందుకు మారుస్తుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే

|

Mar 26, 2021 | 8:04 PM

ఊసరవెల్లి ఎప్పటికప్పుడు దాని రంగును మారుస్తుందని మనందరికీ తెలుసు. అందుకే మనుషులు దాని స్వభావానికి అనుగుణంగా రకరకాల సామెతలు సృష్టించారు.

Chameleon: ఊసరవెల్లి దాని రంగును ఎప్పుడు, ఎలా,  ఎందుకు మారుస్తుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే
Chameleon
Follow us on

Chameleon: ఊసరవెల్లి ఎప్పటికప్పుడు దాని రంగును మారుస్తుందని మనందరికీ తెలుసు. అందుకే మనుషులు దాని స్వభావానికి అనుగుణంగా రకరకాల సామెతలు సృష్టించారు. అయితే అసలు ఊసరవెల్లి దాని రంగును మళ్లీ మళ్లీ ఎందుకు మారుస్తుందనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..?. వెయిట్.. ఊసరవెల్లి రంగును మార్చడానికి గల శాస్త్రీయ, సహజ కారణాల్ని మేము మీకు వివరించబోతున్నాం. ప్రకృతి ప్రతి జీవికి ఒక నైపుణ్యాన్ని ఇస్తుంది. దాంతో జీవులు బ్రతుకు గమనాన్ని సాగిస్తాయి.

సహజ కారణం

తనపై అటాక్ చేయాలనుకున్న జీవుల దృష్టి మరల్చడానికి ఊసరవెల్లి తన రంగును మార్చుకుంటుంది. చాలా సార్లు ఊసరవెల్లిలు వేటాడేటప్పుడు కూడా వాటి రంగును మారుస్తాయి.  తద్వారా తాను వేటాడాలనుకున్న జీవిని మాయ చేసి.. ఒడిసిపడతాయి. ఊసరవెల్లిలు తన రంగులు మార్చే నైపుణ్యాన్ని ప్రధానంగా భద్రత, వేట ప్రక్రియ రెండింటిలోనూ ఉపయోగిస్తాయి.

శాస్త్రీయ కారణం

ఊసరవెల్లి తన భావాలకు అనుగుణంగా రంగును మారుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడటానికి,  దాని మానసిక స్థితి గురించి ఇతర జంతువులకు చెప్పడానికి రంగును మారుస్తుంది. ఊసరవెల్లి తరచుగా వాటి రంగును మాత్రమే మారుస్తుందని మనకు తెలుసు. కానీ ప్రమాదం విషయంలో, ఊసరవెల్లిలు వాటి రంగుతో పాటు వాటి ఆకారాన్ని కూడా మారుస్తాయని ఒక పరిశోధనలో తేలింది.  ఊసరవెల్లిలు అవసరమైతే వాటి పరిమాణాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తాయట.

రంగులు ఎలా మారుతాయి

ఊసరవెల్లి శరీరానికి ఫోటోనిక్ క్రిస్టల్ అని పిలువబడే పొర ఉంటుంది. ఇది పర్యావరణానికి అనుగుణంగా రంగును మార్చడానికి దానికి సహాయపడుతుంది. వాస్తవానికి ఫోటోనిక్ క్రిస్టల్ పొర కాంతి ప్రతిబింబాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఊసరవెల్లి ఉత్సాహంతో ఉన్నప్పుడు, ఫోటోనిక్ క్రిస్టల్ పొర వదులుగా మారుతుంది.  దీంతో దాని రంగు ఎరుపు లేదా పసుపు రంగులో కనిపిస్తుంది. అదనంగా, దీనికి  స్ఫటికాలతో కూడిన మరొక పొర ఉంటుంది.  వేడి నుండి రక్షించడానికి ఈ పొర సహయపడుతుంది.

ఇది కూడా చదవండి: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం