Viral News: వామ్మో… ఇదేందయ్యా ఇది… “ఆ బిస్కెట్లు తినకపోతే పిల్లలకు కీడు”.. షాపుల ముందు క్యూ

|

Oct 01, 2021 | 1:56 PM

నిజం గడప దాటక‌ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందని అంటారు పెద్దలు. ఈ సామెత చాలా సందర్భాల్లో నిజమే కదా అనిపిస్తుంది. తాజాగా బీహార్‌లో ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది.

Viral News: వామ్మో... ఇదేందయ్యా ఇది... ఆ బిస్కెట్లు తినకపోతే పిల్లలకు కీడు.. షాపుల ముందు క్యూ
Strange Rumor
Follow us on

నిజం గడప దాటక‌ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందని అంటారు పెద్దలు. ఈ సామెత చాలా సందర్భాల్లో నిజమే కదా అనిపిస్తుంది. తాజాగా బీహార్‌లో ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇంట్లో ఉన్న పిల్లలందరూ పార్లే-జీ బిస్కెట్లు తినకపోతే వారికి కీడు వాటిల్లుతుందట. సీతామర్హి జిల్లాలో  ‘జితియా వ్రతం’ నేపథ్యంలో ఈ వదంతులు వ్యాపించాయి. జితియా వ్రతం రోజున తల్లులు తమ బిడ్డల దీర్ఘాయువు, రక్షణ  సంతోషకరమైన జీవితం కోసం ఉపవాసం ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరిగే తంతే. అయితే ఈసారి మాత్రం ఎవరో పిల్లలకు కీడు జరగకుండా కాకుండా ఉండాలంటే వారు పార్లే జీ బిస్కెట్లు తినాలని వదంతులు క్రియేట్ చేశారు. ఈ మాట విన్న వెంటనే అది నిజమో, రూమరో అని కూడా ఆలోచించకుండా జనాలు షాపుల ముందు బిస్కెట్లు కొనేందుకు క్యూ కట్టారు. ఎంతలా అంటే.. ఇప్పుడు సీతామర్హి జిల్లాలో బిస్కెట్ల నిల్వలు అయిపోయాయి. బార్గానియా, ధేంగ్, నాన్‌పూర్, డుమ్రా, బాజ్‌పట్టి, మేజర్‌గంజ్ ప్రాంతాల్లో ఈ రూమర్ వ్యాపించింది. ఆయా ఏరియాల్లో  జనాలు పార్లే-జీ బిస్కెట్లు కొనేందుకు బారులు తీరారు. రూమర్ ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ.. పార్లే-జీ కంపెనీకి మాత్రం వారు పెద్ద  హెల్పే చేశారు. ఆ కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఎందుకు ఇంతలా కొనుగోలు చేస్తున్నారని స్థానికులను అడిగితే .. “బిస్కెట్ ప్యాకెట్ రేటు చాలా తక్కువ. ఒకవేళ ఆ వార్త నిజం అయితే కొద్ది మొత్తం కోసం బిడ్డల భవిష్యత్‌ కోసం బలి చేయాల్సి ఉంటుంది. అందుకే కొనుగోలు చేస్తున్నాం” అని చెబుతున్నారు.

కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం “ఈ జనాలు ఎప్పటికీ మారరు. పార్లే-జీ బిస్కెట్లు తినడానికి, పిల్లలకు కీడు జరగడానికి సంబంధం ఏముంటుంది. వీరి అమాయకత్వాన్ని చూస్తుంటే జాలేస్తుంది” అని చెబుతున్నారు.

Also Read: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

 కలికాలం అంటే ఇదే కదా..! రైస్ కుక్కర్‌తో పెళ్లేంటి గురూ..!