Brain Waves of Dying Person: మరణించే సమయంలో వ్యక్తుల ప్రవర్తన ఇలానే ఉంటుంది.. నమ్మలేని నిజాలు..

|

Feb 28, 2022 | 10:19 AM

జనన మరణాలు ప్రతి జీవికి సాధారణం. ఐతే భావోద్వేగాలు బయటికి కనిపంచేలా ప్రలాపించేది మాత్రం ఒక్క మనిషి మాత్రమే. మరణించిన తర్వాత మరో ప్రపంచం ఉంటుందనే..

Brain Waves of Dying Person: మరణించే సమయంలో వ్యక్తుల ప్రవర్తన ఇలానే ఉంటుంది.. నమ్మలేని నిజాలు..
Brain Waves
Follow us on

What goes on in the human brain at the time of death: జనన మరణాలు ప్రతి జీవికి సాధారణం. ఐతే భావోద్వేగాలు బయటికి కనిపంచేలా ప్రలాపించేది మాత్రం ఒక్క మనిషి మాత్రమే. మరణించిన తర్వాత మరో ప్రపంచం ఉంటుందనే వాదనపై ఈ లోకంలో పలు రకాలైన సంగతులు ప్రచారంలో ఉన్నాయి. ఐతే దానిని చూసి వచ్చి ఇలా ఉంటుందని ప్రయోగ పూర్వకంగా చెప్పినవారు మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ లేదు. అఫ్‌కోర్స్‌ అది సాధ్యం కాదనుకోండి! కానీ అస్తగమన సమయంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వారి మెదడు స్థితి ఏమిటి? ప్రాణం ఏ విధంగా దేహాన్ని వీడుతుందనే విషయం మాత్రం బట్టబయలైంది. సైంటిస్టులు మూర్ఛ వ్యాధి (epilepsy)తో బాధపడుతున్న 87 ఏళ్ల వృద్ధుడిపై ఈ ప్రయోగం చేశారు. మరి కొన్ని క్షణాల్లో చనిపోబోతున్న మనిషి మనసు గతేమిటో.. ఆ సంగతులు తెలుసుకుందాం..

ఎస్టోనియాలోని టార్టు యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ రౌల్ విసెంటే మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87 ఏళ్ల వృద్ధుడి మెదడుకు ఈఈజీ (EEG machine) యంత్రాన్ని అమర్చి పరిశోధన చేశారు. తొలిసారిగా ఈ యంత్రం ద్వారానే మరణిస్తున్న వ్యక్తి ఆలోచనలను రికార్డు చేశారు. ఈ పరిశోధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వచ్చాయి. చావును కొందరు దీర్ఘనిద్రగా అభివర్ణిస్తారు. దీనికి సరిపోలే ప్రవర్తన చనిపోయే ముందు ఉంటుందట. అంటే కలలు కంటున్నప్పుడు మనిషి పొందే అనుభూతి ఏ విధంగా ఉంటుందో.. అదే విధంగా ప్రవర్తిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు చావు గడియల్లో ఒక వ్యక్తి తన పాత జీవితాన్ని, వాటి తాలూకు జ్ఞాపకాలను కొన్ని క్షణాలపాటు నెమరువేసుకుంటాడట. దాదాపు 900 సెకన్లపాటు నమోదు చేసిన ఈ రికార్డింగ్‌లో మరణించే వ్యక్తి గుండె ఎగసిపడుతున్నట్లు చూపించింది. అలల మాదిరి ఉన్న కొన్ని ప్రకంపనలు వేగంగా ఉన్నట్లు.. మరణం సమీపిస్తున్న కొద్దీ ఈ అలలు మందగించడం ప్రారంభినట్లు వెల్లడించారు. తర్వాత గుండెపోటు వచ్చి మృతి చెందుతున్నట్లు కనుగొన్నారు. ఈ ప్రయోగంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి మరణానికి ముందు ఆ తర్వాత అతని శరీరంలోని ఏ అవయవాన్ని ఎంతకాలంలోపు డొనేట్‌ చేయవచ్చో కూడా ఈ పరిశోధన తెల్పింది.

Also Read:

IIT Kharagpur: నెట్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపికలు.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు..వివరాలివే!