Bizarre Incident: ఆ డీజే సౌండ్‌తో నా కోళ్లు చచ్చాయి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు..

| Edited By: Janardhan Veluru

Nov 24, 2021 | 2:37 PM

Odisha Poultry Farmer: ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. డీజే సౌండ్‌‌తో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తుతోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కోళ్ల ఫామ్‌లో కోళ్లు విలవిలలాడుతూ కుప్పకులాయి. క్షణాల్లోనే

Bizarre Incident: ఆ డీజే సౌండ్‌తో నా కోళ్లు చచ్చాయి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు..
Chickens
Follow us on

Odisha Poultry Farmer: ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. డీజే సౌండ్‌‌తో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కోళ్ల ఫామ్‌లో కోళ్లు విలవిలలాడుతూ కుప్పకులాయి. క్షణాల్లోనే పదుల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో బాధిత రైతు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. డీజే సౌండ్ కారణంగానే తన 63 కోళ్లు చనిపోయాయని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వింత ఘటన ఒడిశాలోని బాలాసోర్‌‌లో చోటుచేసుకుంది. బాలాసోర్‌కు చెందిన రంజిత్‌ అనే యువకుడు కోళ్లఫారమ్‌ నడుపుతున్నాడు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన రంజిత్ ఉద్యోగం లేకపోవడంతో రూ.2 లక్షల లోన్‌ తీసుకుని కోళ్ల ఫామ్‌ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం కోళ్ల ఫామ్‌ పక్కనే ఉన్న ఇంట్లో వివాహం జరిగింది. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిల్లులు పడేలా డీజే సౌండ్‌ పెట్టారని, ఈ సౌండ్‌కు కోళ్లు గిలగిలలాడి పడిపోయాయని రంజిత్‌ తెలిపాడు. సౌండ్ తగ్గించాలని వేడుకున్నా.. వారు పట్టించుకోలేదని పోలీసులకు చెప్పాడు. మోతాదుకు మించిన అతి సౌండ్ కారణంతో 63 కోళ్లు మృతిచెందాయని తెలిపాడు. ఇవి 180 కేజీల బరువు ఉన్నట్లు తెలిపాడు.

ఆ తర్వాత రోజు.. కోళ్లు ఎందుకు చనిపోయాయో తెలుసుకునేందుకు వెటర్నరీ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపాడు. వెటర్నరీ డాక్టర్‌ గుండె పోటుతోనే కోళ్లు మృతిచెందినట్లు నిర్ధారించారని.. దీనికి డీజే శబ్దాలే కారణమని స్పష్టం చేశారని వివరించారు. తనకోళ్లు మృతి చెందినందుకు తనకు నష్టపరిహారం ఇప్పించాలని నీలగిరి పోలీసులను కోరాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ వింత కేసు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Viral Video: చిచ్చరపిడుగు.. తల్లిని రక్షించేందుకు దొంగపై పిడిగుద్దుల వర్షం.. ఆ తర్వాత ఏమైందంటే..?

Star Health IPO: నవంబర్ 30 నుంచి స్టార్ హెల్త్ ఐపీవో.. ఒక్కో షేరుకు రూ. 870-900గా నిర్ణయం..