Variety Laddoos: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు… పరిశోధనలో విస్తుపోయే విషయాలు

|

Mar 27, 2021 | 5:27 PM

ప్రపంచంలో వింత విషయాల కోసం ఎల్లప్పుడూ అన్వేషణ ఉంటుంది. చరిత్రలోని నిజాలను తెలుసుకునేందుకు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఎప్పుడూ అదే పనిలో ఉంటుంది. 

Variety Laddoos: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు... పరిశోధనలో విస్తుపోయే విషయాలు
Weired Laddoos Found
Follow us on

ప్రపంచంలో వింత విషయాల కోసం ఎల్లప్పుడూ అన్వేషణ ఉంటుంది. చరిత్రలోని నిజాలను తెలుసుకునేందుకు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఎప్పుడూ అదే పనిలో ఉంటుంది.  ఈ ప్రక్రియలో అనేక ఆశ్యర్యపరిచే విషయాలు తెలిసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు నిధులు, మరికొన్నిసార్లు గత సంస్కృతుల తాలూకా ఆనవాళ్లు.. ఇంకొన్నిసార్లు కొన్ని విచిత్ర వస్తువులు లభ్యమైన దాఖలాలు ఉన్నాయి. కొన్ని వస్తువుల విషయంలో అయితే మనకు నమ్మకం కూడా కుదరదు. ఏదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది.  తాజాగా చరిత్ర గురించి మరో షాకింగ్ నిజం బయటపడింది. ఇది మీ అందర్నీ ఆశ్యర్యపరుస్తుంది. బహుశా మీరు దాని గురించి తెలియగానే ఒక్క క్షణం షాక్ అవుతారు. కొన్నేళ్ల క్రితం పరిశోధకులు రాజస్థాన్‌లో తవ్వకాలు జరుపుతుండగా  వింత లడ్డూలను కనుగొన్నారు. ఇది పూర్తి నిజం. పురావస్తుశాఖకు సంబంధించిన ఓ జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు.

అధికారుల నుంచి అందుతోన్న  సమాచారం ప్రకారం, 2017 సంవత్సరంలో రాజస్థాన్‌లోని బీంజోర్‌లో తవ్వకాల సమయంలో హరప్ప సంస్కృతి కాలానికి చెంది ఏడు లడ్డూలు లభ్యమయ్యాయి. గత నాలుగేళ్లుగా వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ లడ్డూల గురించి పరిశోధనలు జరుపుతుండగా.. ఇప్పుడు చాలా షాకింగ్ విషయం తెలిసింది. వీటిని సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఈ లడ్డూలు మల్టీగ్రెయిన్, అధిక ప్రోటీన్స్ కోసం అప్పట్లో తినేవారని.. న్యూఢిల్లీలో ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లక్నోలోని బిర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ లడ్డూలన్నీ క్రీ.పూ 2600 కు చెందినవని కూడా చెబుతున్నారు. శాస్త్రవేత్త రాజేష్ అగ్నిహోత్రి మాట్లాడుతూ అవి విరిగిపోయి ఉంటే అవి పూర్తిగా నాశనమయ్యేవి అని చెప్పారు.

లడ్డూల వెనుక అసలు నిజం ఏమిటి?

శాస్త్రవేత్త రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఈ లడ్డూలపై నీరు పోసినప్పుడు వాటి కలర్ ఉదా రంగులోకి మారిందని చెప్పారు. ఈ లడ్డూలను కొన్ని రహస్య కార్యకలాపాలకు కూడా వినియోగించేవారని చెబుతున్నారు. ఎందుకంటే, లడ్డూలతో పాటు విగ్రహాలు, ఉలిలాంటి పరికరం కూడా దొరికాయి. తదుపరి విశ్లేషణ కోసం వీటిని బీఎస్ఐపీకి అప్పగించారు. “దర్యాప్తులో, ఈ లడ్డూలను కాబూలి గింజలు, నూనెగింజలు, గోధుమల మిశ్రమంతో తయారు చేసినట్లు కనుగొనబడింది. ప్రస్తుతానికి, పరిశోధన ఇంకా కొనసాగుతోంది” అని బిఎస్ఐపి శాస్త్రవేత్త అంజుమ్ ఫారూకి చెప్పారు.

Also Read: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.6 కోట్ల లాటరీ టికెట్‌ అలా ఇచ్చేసింది.. మీరు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెబుతారు