AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat with Human Face: మనిషిని పోలిన మేక.. దేవుడంటూ పూజిస్తున్న జనం.. వైరల్‌గా మారిన వీడియో..

Goat Born with Human Face: సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని సంతోషాన్ని పంచేవి అయితే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా..

Goat with Human Face: మనిషిని పోలిన మేక.. దేవుడంటూ పూజిస్తున్న జనం.. వైరల్‌గా మారిన వీడియో..
Goat With Human Face
Narender Vaitla
|

Updated on: Apr 09, 2021 | 1:10 PM

Share

Goat Born with Human Face: సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని సంతోషాన్ని పంచేవి అయితే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వింత ఆకారాల్లో జన్మించిన జంతువుల వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో నిత్యం హల్‌చల్‌ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సోంగాధ్ తాలూకాలో ఉన్న తపి నది ఒడ్డున ఉన్న సెల్టిపాడ గ్రామంలో ఓ అద్భుతం జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకల పెంపకం చేస్తున్నాడు. తాజాగా ఆయన మేకల మందలో ఉన్న ఓ మేక బుజ్జి మేకకు జన్మనిచ్చింది. అయితే దానిని చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ మేకకు సహజంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. కానీ ముఖం మాత్రం మనిషిని పోలి ఉండడం విశేషం. కళ్లు, ముక్కు, నోరు ఇలా అన్ని మనిషిని పోలి ఉండడంతో స్థానికు తండోపతండాలుగా చేరుకున్నారు. అయితే ఈ మేక జన్మించిన తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే మరణించింది. ఇదిలా ఉంటే ఈ మేకను చూసిన గ్రామస్థులు దేవుడిగా భావించి పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతకీ ఈ మేక మనిషి రూపాన్ని ఎందుకు పోలి ఉందో తెలియాలంటే నిపుణులు స్పందించాల్సి ఉంది. మరి ‘మనిషి.. మేక’పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Rahul Gandhi: వ్యాక్సినేషన్ తో ‘పండగ’ చేసుకోవడం కాదు.. రాష్ట్రాలకు సక్రమంగా పంపండి..రాహుల్ గాంధీ  తీవ్ర వ్యాఖ్యలు 

Selfie On Mars: అంతరిక్షంలో అద్భుతం.. అంగారక గ్రహంపై అద్భుత సెల్ఫీ.. రెండు రోబోలు ఒకే ఫ్రేమ్‌లో..

Adorable Video Viral: పనిచేసే కార్మికుడితో సరదాగా ఆటలు ఆడిన అల్లరి గున్న ఏనుగు.. ఎవరు గెలిచారంటే..!

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..