Dog born Elephant shape Viral Video: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. శునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. ఈ ఘటన జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుక్క పిల్లకు తొండం, పెద్ద పెద్ద చెవులు ఉండటంతో దానిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. కాట్రావులపల్లి గ్రామానికి చెందిన దనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు.. రెండేళ్లుగా ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెంచుకుంటున్న శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే.. ముందు పుట్టిన మూడు పిల్లలు సాధారణంగా ఉండగా.. తర్వాత పుట్టిన నాల్గవ పిల్ల వినాయకుని ఆకారంలో కనిపించడంతో దంపతులు ఆశ్చర్యపోయారు. కుక్క పిల్లకు తొండం, పెద్ద చెవులు ఉండటంతో సాక్షాత్తు వినాయకుడే తమ ఇంట పుట్టాడని యజమాని దనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకోవడం లేదని.. విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం లేదని దంపతులు పేర్కొన్నారు. దీని కారణంగానే తమ ఇంట వినాయకుడు పుట్టాడని.. పూజలు చేస్తున్నారు. అయితే.. ఇలా కుక్కపిల్ల జన్మించడంతో తన ఇంటి ముందు వినాయకుడి గుడి కట్టించాలని దంపతులు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. వినాయకుడి ఆకారంలో కుక్క జన్మనివ్వడంతో ప్రజలు తండోపతండాలుగా.. నరసయ్య ఇంటికి చేరుకుని చూస్తున్నారు. సాక్షాత్తూ వినాయకుడేనంటూ పలు పలువురు పూజలు సైతం చేస్తున్నారు.
వీడియో..
Also Read: