A huge Dolphin in Antarvedi coast : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సాగర సంగమం ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న దీవికి భారీ సముద్ర డాల్ఫిన్ కొట్టుకొచ్చింది. ఒడ్డున ఉన్న వారికి అతి పెద్ద ఎత్తున సముద్రంలో కనబడటంతో స్థానిక మత్స్యకారులు బోటు పై వెళ్లి చూశారు. అయితే, అప్పటికే డాల్ఫిన్ చనిపోయి కుళ్ళిపోయిన స్థితికి చేరుకుందని మత్స్యకారులు చెబుతున్నారు . ఇంత పెద్ద చేపను చూడడం ఇదే మొదటిసారని వారంటున్నారు. ఇది సముద్ర డాల్ఫిన్ అయి ఉండొచ్చని, సముద్రంలో ఆయిల్ సంస్థలకు చెందిన సర్వేలు జరిపే యంత్రలు తగిలి గాయాలై చనిపోయి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.