పల్నాడు ప్రాంతంలో కొత్త పంచాయితీ..జగన్ పరిష్కరించగలరా?

గురజాల వర్సెస్‌ నరసరావు పేట. పల్నాడు కొత్త జిల్లా కేంద్రంపై రగడ మొదలైంది. జిల్లాల విభజన జరుగుందని తెలిసిన తర్వాత తమ ప్రాంతానికే జిల్లా కేంద్రం రావాలని నేతలు పైరవీలు చేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇందులో మొదటగా మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. గుంటూరు జిల్లాను […]

పల్నాడు ప్రాంతంలో కొత్త పంచాయితీ..జగన్ పరిష్కరించగలరా?
Follow us

|

Updated on: Feb 01, 2020 | 4:42 PM

గురజాల వర్సెస్‌ నరసరావు పేట. పల్నాడు కొత్త జిల్లా కేంద్రంపై రగడ మొదలైంది. జిల్లాల విభజన జరుగుందని తెలిసిన తర్వాత తమ ప్రాంతానికే జిల్లా కేంద్రం రావాలని నేతలు పైరవీలు చేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇందులో మొదటగా మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. గుంటూరు జిల్లాను విభజించి పల్నాడు, తెనాలి ప్రాంతాలను కొత్త జిల్లాలుగా విభజించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి.

పల్నాడు వెనుకబడిన ప్రాంతం. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ రాజ్యమేలేది. పగ ప్రతీకారాలతో అక్కడి ప్రజలు రగిలిపోయేవారు. ప్రస్తుతం పల్నాడు అభివృద్ధి బాట పట్టింది. ఖనిజ సంపదలను ఉపయోగించుకోవడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. పిడుగురాళ్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున సున్నం నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణానది తీరప్రాంతంలో సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు అయ్యాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు విద్యపరంగా కూడా దూసుకెళుతోంది.

గురజాల, నర్సరావుపేట రెవెన్యూ డివిజన్లు ఉన్న పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. మాచర్ల నుండి జిల్లా కేంద్రం గుంటూరు వచ్చి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. కలెక్టరేట్‌, కోర్టు, ఎస్పీ కార్యాలయం ఇలా అన్ని ప్రభుత్వ ఆఫీసులు పల్నాడు ప్రాంత వాసులకు దూరంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పల్నాడును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది.

ఏపీలో జగన్‌ సీఎం అయిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై కదలిక వచ్చింది. అన్నట్లుగానే పల్నాడు జిల్లాపై ఏర్పాటు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అయితే ఇక్కడ రగడ మొదలైంది. పల్నాడు జిల్లా కేంద్రం ఎక్కడా ఏర్పాటు చేస్తారు అనే దానిపై ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్య రచ్చ నడుస్తోంది. గురజాలలో ఏర్పాటు చేస్తారని కొందరు..కాదు కాదు నర్సరావుపేట జిల్లా కేంద్రమవుతుందని మరి కొందరు వాదనలకు దిగుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం జిల్లా కేంద్రంపై నిర్ణయం తీసుకోలేదని…పల్నాడు జిల్లా మాత్రం ఏర్పాటు అవుతుందని క్లారిటీ ఇస్తున్నారు.

పల్నాడు కొత్త జిల్లాతో ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోందట. పల్నాడులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాలో కొత్తగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే… కేంద్రమే అరవై శాతం నిధులు ఇస్తుంది. దీంతో పల్నాడు జిల్లాగా మార్చి మెడికల్‌ కాలేజీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కోరిక మేరిక అక్కడ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తారని ఓ సమాచారం. నరసరావుపేటను జిల్లా కేంద్రం చేసి..గురజాలకు మెడికల్‌ కాలేజీ కేటాయిస్తే రెండు ప్రాంతాలను బ్యాలెన్స్‌ చేసినట్లు అవుతుందని ప్రభుత్వ పెద్దల ఆలోచన. మొత్తానికి జిల్లాల విభజనపై అప్పుడే రచ్చ మొదలైంది. ఇది ఎటూ దారితీస్తుందో చూడాలి.

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు