దేశ చరిత్రలో అద్భుత ఆవిష్కృతం.. గడువు కంటే ముందే చారిత్రక జోజిలా టన్నెల్‌.. నిర్మాణంలో మేఘా సంస్థ ఘనత!

|

Mar 30, 2022 | 7:51 PM

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. కశ్మీర్‌-లడఖ్‌ మధ్య దూరాన్ని తగ్గించే అతి భారీ చారిత్రక జోజిలా టన్నెల్‌ పనులు వేగంగా రూపుదిద్దుకుంటుంది. సరికొత్త టెక్నాలజీతో ప్రతికూల వాతావరణంలోను టన్నెల్ పనులు 7కిలోమీటర్ల మేర పూర్తి చేసింది అగ్రగామి సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌.

దేశ చరిత్రలో అద్భుత ఆవిష్కృతం.. గడువు కంటే ముందే చారిత్రక జోజిలా టన్నెల్‌.. నిర్మాణంలో మేఘా సంస్థ ఘనత!
Zojila Tunnel
Follow us on

Zojila Tunnel by Megha Engineering: స్వతంత్ర భారతదేశ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. కశ్మీర్‌-లడఖ్‌(Kashmir-Ladakh) మధ్య దూరాన్ని తగ్గించే అతి భారీ చారిత్రక జోజిలా టన్నెల్‌(Zojila Tunnel) పనులు వేగంగా రూపుదిద్దుకుంటుంది. సరికొత్త టెక్నాలజీతో ప్రతికూల వాతావరణంలోను టన్నెల్ పనులు 7కిలోమీటర్ల మేర పూర్తి చేసింది అగ్రగామి సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(Megha Engineering & Infrastructures Limited). ఈ సొరంగం నిర్మాణం తరువాత, సైన్యం కాశ్మీర్ నుండి లడఖ్‌కు సులభంగా చేరుకుంటుంది. భారతదేశంలోని ప్రముఖ అభివృద్ధి ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి కావడం విశేషం. ఇది దాని షెడ్యూల్ పరిమితి కంటే ముందే సిద్ధంగా ఉంటుంది.

జోజిలా టన్నెల్ నిర్మాణం గడువు కంటే ముందే ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నవంబర్ 2026 గడువు విధించారు. అదే సమయంలో, వేగంగా పని చేయడం ద్వారా, ఇది సెప్టెంబర్ 2024 నాటికి సిద్ధంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ది ట్రిబ్యూన్ ప్రకారం, దీని తర్వాత భారత సైన్యం అత్యవసర పరిస్థితుల్లో దీనిని ఉపయోగించుకోగలుగుతుంది. సరిహద్దులో చైనా సైన్యం ఎలాంటి అలజడి సృష్టించినా, భారత సైన్యం ఈ సొరంగం ద్వారా చేరుకోగలదని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

30 ఏళ్ల లద్దాఖ్‌ ప్రజల కోరిక నెరవేరబోతోంది. సరిహద్దుల్లో సైనిక అవసరాలను తీర్చేందుకు నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ వేగంగా రూపుదిద్దుకుంటుంది. ఆసియాలోనే అతిపొడవైన జోజిలా టన్నెల్‌ పనులను పరుగులు పెట్టిస్తుంది తెలుగు వారి సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌. అతి స్వల్ప కాలంలోనే 7కిలోమీరట్ల మేర పూర్తి చేసింది. హిమాలయాల్లో నిరంతరంగా కురుస్తున్న మంచును.. తరచుగా వచ్చే మంచు తుపానుల సైతం ఏమాత్రం లెక్కచేయకుండా టన్నెల్‌ పనులను వేగ‌వంతంగా కొన‌సాగిస్తోంది MEIL. భారీ హిమాలయ పర్వత శ్రేణులను సైతం తొలగించి వేగంగా పనులను కొనసాగిస్తూ సత్తాను చాటుతుంది.

భౌగోళిక ప్రాంతంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనులను పూర్తి చేస్తూ ప్రపంచంలోనే తొలిసారి టన్నెల్ నిర్మాణం చేస్తుంది MEIL. తనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యం, అనుభంతో జోజిలా ప్రాజెక్టును నిర్మిస్తుంది మేఘా ఇంజినీరింగ్. 1,268 అత్యాధునిక యంత్రాలు.. వివిధ పరికరాలను జోజిలా ప్రాజెక్టు పనుల కోసం వినియోగిస్తుంది. దాదాపు 2,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తుండగా, అనేక మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కల్పిస్తున్నది ప్రతిష్టాత్మక సంస్థ. న్యూ ఆస్ట్రియన్‌ టన్నెలింగ్‌ మెథడ్‌, స్నోబ్లోయర్స్, పేవర్స్‌, స్పెషలైజ్డ్‌ బూమర్స్ వంటి అత్యాధునిక యంత్రాలను, ఇంజినిరింగ్‌ పద్ధతులను జోజిలా టన్నెల్ పనుల్లో వినియోగిస్తుంది.

ఇప్పటికే టెన్నెల్‌ పనులు 7 కిలోమీటర్లు మేర పూర్తి కాగా.. జోజిలా రూట్‌లో నదిని దాటడానికి 815 మీటర్ల పొడవున నాలుగు బ్రిడ్జిలు ఈ ప్రాజెక్టులో భాగంగా కానున్నాయి. బ్రిడ్జీల నిర్మాణం కోసం సబ్‌ స్ట్రక్చర్స్‌, ఫౌండేషన్లు పూర్తిచేసింది MEIL. “దేశం మొత్తం అసాధ్యమనుకున్న ప్రాజెక్ట్ ను మేం సాధించగలిగామని చెప్పారు MEIL ప్రాజెక్ట్ హెడ్ హర్‌పాల్‌ సింగ్‌. మీనామార్గ్‌ పరిసరాల్లో సైనిక సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, అనేక మంది స్థానికులు చ‌లికాలంలో ఈ ప్రాంతాన్ని వదిలివెళ్లినప్పటికీ.. అంకితభావంతో MEIL సిబ్బంది ఇక్కడే ఉంటూ టన్నెల్‌ తవ్వకం పనులను వేగంగా కొనసాగిస్తుంది…

1999లో కార్గిల్‌లో ఆవశ్యకత ఏర్పడింది. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో జోజిలా సొరంగం అవసరమని మొదటిసారిగా భావించింది భారత సర్కార్. ఇప్పుడు సరిహద్దులో చైనా కార్యకలాపాలు సాగిస్తున్న తీరు చూస్తుంటే దాని నిర్మాణం అవసరమే అనిపించింది. ఈ సొరంగం ద్వారా భారత సైన్యం తమ వస్తువులతో సులువుగా వెళ్లేందుకు వీలుంటుంది. ఇది పూర్తయిన తర్వాత మూడున్నర గంటల దూరం 15 నిమిషాలకు తగ్గుతుందని ప్రాజెక్ట్ మేనేజర్ హర్పాల్ సింగ్ తెలిపారు. చలికాలంలో కూడా ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలకు చేరుకున్నప్పటికీ, ఈ ఎడారి కొండలో 1000 మంది కార్మికులు దానిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. ఈ కాలంలో హర్పాల్ ఎలుగుబంట్లు నాలుగు నెలల పాటు వేడి ప్రదేశాలకు వెళ్తాయి. కానీ మేము పనిని సమయానికి ముందే పూర్తి చేయడానికి మనుషులను నియమించుకున్నామన్నారు.

చైనా , పాకిస్తాన్‌లతో ఉన్న పొడవైన సరిహద్దు ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ సొరంగం మాతృభూమి రక్షణలో పెద్ద కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సొరంగం కాశ్మీర్‌లోని సోనామార్గ్‌ను లడఖ్‌లోని మినామార్గ్‌ను కలుపుతుందని హర్పాల్ సింగ్ చెప్పారు. దీని తయారీకి రూ.2,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గుర్రపుడెక్క ఆకారంలో ఉండే జోజిలా టన్నెల్ 3,485 మీటర్ల ఎత్తుతో భారతదేశంలోనే అతి పొడవైన సొరంగం. ఇంజినీరింగ్‌లో ఇదొక గొప్ప పరిణామమని ఆయన అన్నారు. ఇది పూర్తయిన తర్వాత, బాల్టాల్ నుండి మినామార్గ్ వరకు దూరం 40 కి.మీ నుండి కేవలం 13 కి.మీకి తగ్గుతుంది.

Read Also…  Crisis: ఆ దేశంలో ఇకపై ప్రతి రోజు 10 గంటలు కరెంట్ కట్.. డీజిల్ దొరకక నిలిచిన రవాణా