Zika virus: థర్డ్‌ వేవ్‌తో పాటు దేశాన్ని అదే రేంజ్‌లో బేంబేలెత్తిస్తున్న జికా వైరస్… ఇవి లక్షణాలు

|

Jul 11, 2021 | 11:24 AM

కరోనాతో చావొచ్చిపడుతోందీ అనుకుంటే ఇప్పుడు జికా వైరస్‌ వెంటాడుతోంది. ఇది ఎంతమంది ప్రాణాలు తీస్తుందో కూడా తెలియడం లేదు. దేశంలో...

Zika virus: థర్డ్‌ వేవ్‌తో పాటు దేశాన్ని అదే రేంజ్‌లో బేంబేలెత్తిస్తున్న జికా వైరస్... ఇవి లక్షణాలు
Zika Virus
Follow us on

కరోనాతో చావొచ్చిపడుతోందీ అనుకుంటే ఇప్పుడు జికా వైరస్‌ వెంటాడుతోంది. ఇది ఎంతమంది ప్రాణాలు తీస్తుందో కూడా తెలియడం లేదు. దేశంలో ఫస్ట్‌వేవ్‌లో ఫస్ట్ కరోనా కేసులు నమోదైంది కేరళలో. రానురాను అది దేశమంతా విస్తరించింది. తగ్గింది అనుకునే లోపే అదే కేరళ నుంచి సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది… వేలాది మందిని చంపేసింది. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌తో పాటే దేశాన్ని అదే రేంజ్‌లో బేంబేలెత్తిస్తున్న జికా వైరస్ కూడా కేరళ నుంచి స్టార్ట్ అవుతోంది. జికా కొత్తదేమీ కాదు. గతంలోనూ వచ్చింది. అప్పుడు మొదలైంది కూడా కేరళ నుంచే. తాజాగా జికా మళ్లీ కేరళలో ఉనికిలోకిరావడంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు బోర్డర్‌లో చెక్‌పోస్టులు పెట్టేసుకున్నాయి.

కన్యాకుమారి, నీలగిరి, కోయింబత్తూర్‌లలో ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెడికల్ టెస్ట్‌లు నిర్వహించిన తర్వాతే ఎంట్రీకి పర్మిట్ చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడుల్లో బోర్డర్‌ విలేజెస్‌లో అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ఆరాతీస్తున్నారు. జికా వైరస్ ఉన్న వాళ్ల కోసం ప్రత్యేకమైన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు

ఎలా వ్యాపిస్తుందంటే….

ఈ వైరస్ కలిగిన ఆడ ఏడిస్ దోమ కుట్టుడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని కూడా కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, ఒంటిపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కండ్ల కలక, దగ్గు, గొంతునొప్పి, లింఫ్ గ్రంథులు ఉబ్బడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే పుట్టబోయే పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుంది. పిల్లలు తల చిన్నగా ఉండటం (మైక్రోసెఫాలి) అనే లక్షణంతో జన్మిస్తారు.

Also Read: పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!

గేదె శిశువులో బవిన్ వైరస్ ..! జంతువుల నుంచి మానవులకు వచ్చే అవకాశం..