YSRCP: ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి.. లోక్‌సభ స్పీకర్‌ను కోరిన ఎంపీ భరత్

|

Jun 11, 2021 | 6:43 PM

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద..

YSRCP: ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి.. లోక్‌సభ స్పీకర్‌ను కోరిన ఎంపీ భరత్
Ysrcp Mp Margani Bharat Mee
Follow us on

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌ను కోరారు. అనేక పర్యాయాలు రఘురామకృష్ణరాజు డిస్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ర‌ఘురామ‌ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను సమర్పించామని అన్నారు. అనేక పర్యాయాలు.. అన‌ర్హ‌త వేటుకు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన‌ట్లుగా భ‌ర‌త్ ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి : AP CM Jagan Delhi Tour: విజయవంతంగా సాగిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!

Swami Sivanand Baba : కొవిడ్ టీకా తీసుకున్న 125 ఏళ్ల వ్యక్తి..! వ్యాక్సిన్ తీసుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు