YS Jagan: ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..

|

Jul 24, 2024 | 4:43 PM

ఢిల్లీలో వైఎస్ జగన్ నిరసన దీక్ష ముగిసింది. దేశ వ్యాప్తంగా 8పార్టీల నేతల మద్దతు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ శివసేన, వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి ఏఐడీఎంకే, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆమ్ఆద్మీ పార్టీ ఇలా పలు పార్టీల నేతలు మద్దతు పలికారు.

YS Jagan: ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..
Ys Jagan
Follow us on

ఢిల్లీలో వైఎస్ జగన్ నిరసన దీక్ష ముగిసింది. దేశ వ్యాప్తంగా 8పార్టీల నేతల మద్దతు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ శివసేన, వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి ఏఐడీఎంకే, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆమ్ఆద్మీ పార్టీ ఇలా పలు పార్టీల నేతలు మద్దతు పలికారు. వీరితోపాటూ జేఎంఎం, ఇండియన్ యూనియన్ మస్లీజ్ లీగ్, వీసీకే మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు శివసేన ఉద్ధవ్‌ వర్గం ఎంపీ సంజయ్‌ రౌత్‌. ఏపీలో రక్తపుటేరులు పారుతున్నాయన్నారు. అక్కడి పాలకులకు ఒక్కక్షణం కూడా ప్రభుత్వంలో ఉండే అర్హత లేదన్నారు.

ఏపీలోనే కాదు, తమిళనాడులోనూ శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు ఏఐడీఎంకే ఎంపీ చంద్రశేఖర్‌. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి.. జగన్‌కు మద్దతు తెలిపేందుకు ఢిల్లీ వచ్చానన్నారు. పార్టీలన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాలన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‎లో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన సమాజ్ వాదీ పార్టీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ధర్నా చేస్తున్న శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న ఆయన.. కార్యకర్తలను హింసించడం సరైన పద్దతికాదన్నారు. తన కార్యకర్తల కోసం పోరాడుతున్న జగన్‌కు మద్దతుగా వచ్చానన్నారు. తిరిగి మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ సభ ప్రారంభంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో హింసాకాండ చలరేగిపోయిందన్నారు. తనకు మద్దతు పలికిన 8 జాతీయ పార్టీలకు కృతజ్ఙతలు తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు వైసీపీ అధినేత జగన్‌. ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారనీ.. రేపు మళ్లీ తాము అధికారంలోకి వస్తామనీ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులను, హత్యలను, ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. ఏదేమైనా ఢిల్లీ వేదికగా తాను ఏర్పాటు చేసిన నిరసన దీక్షను విజయవంతం చేశారన్నారు. అలాగే తమ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ముక్తకంఠంతో నినదిస్తూ మద్దతు ప్రకటించారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…