Pakistani Spies: పాక్‌ గూఢచర్యం వ్యవహారంలో 14 మంది అరెస్ట్.. ఇంకెక్కడెక్కడ నక్కారో గుంటనక్కలు..

రాయబార కార్యాలయం పేరుతో పాక్ చేసిన పాకీ పనులు అన్నీఇన్నీకావు. భారత్‌లోని ఈ రాయబార కార్యాలయాన్నే ఒక గూఢచర్య హబ్‌గా పాక్ వాడేసింది. తన కార్యకాలాపాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించసాగింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత దేశంలో అరెస్టయిన గూఢచారులలో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి..

Pakistani Spies: పాక్‌ గూఢచర్యం వ్యవహారంలో 14 మంది అరెస్ట్.. ఇంకెక్కడెక్కడ నక్కారో గుంటనక్కలు..
Pakistani Spies

Updated on: May 20, 2025 | 6:49 AM

న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తాని గూఢచారుల అరెస్టుల సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చణీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ పాకిస్తాని గూఢచారులు 14 మందిని కేంద్ర రక్షణా దళం అరెస్ట్ చేసింది. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ సైనిక ఉద్రిక్తతల తరువాత అనుమానిత పాకిస్తానీ గూఢచారుల పై ఖటిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఉపక్రమించింది. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేయడం, భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణలపై మూడు రాష్ట్రాల నుంచి మొత్తం14 మందిని అరెస్టు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ 14 మంది గూఢచారులు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారికిగా గుర్తించారు. గూఢచర్యానికి హబ్‌గా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మారడం మరో విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశంలో పట్టుబడిన పాకిస్తానీ గూఢచారులందరిలో, చాలా మందికి పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

రాయబార కార్యాలయం పేరుతో భారత్‌లో ఒక గూఢచర్య హబ్‌ను పాక్ ఏర్పాటు చేసి, తన కార్యకాలాపాలు నిర్వహించసాగింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత భారతదేశంలో అరెస్టయిన గూఢచారులలో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత గూఢచారులుగా మారినట్లు గుర్తించారు. పాకిస్తాన్ వీసా, పాకిస్తాన్ పౌరసత్వం, డబ్బు సులభంగా లభిస్తాయని హామీ ఇవ్వడంతో గూఢచర్యానికి నిందితులు సిద్దమైనట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ నిఘా వర్గాలకు చేరవేసిన సమాచారం, ఉగ్రవాదులతో సంబంధాలు, నగదు లావాదేవీలు సహా పహల్గామ్ ఉగ్రదాడి కోణాల్లో గూఢచర్యానికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అరెస్టైన ఆ 14 మంది వీరే..

  • హర్యానాలోని హిసార్‌కు చెందిన యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్ వీసా, పాక్ స్పాన్సర్ చేసిన ట్రిప్పులు డబ్బుతో ఆకర్షితురాలై పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని ఉద్యోగి డానిష్‌తో పరిచయం ఏర్పడింది. భారతదేశ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపారని, తన ట్రావెల్ బ్లాగులు, వీడియోల ద్వారా పాకిస్తాన్‌కు సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
  • దేవిందర్ సింగ్ – హర్యానాలోని కైతాల్ నుంచి అరెస్టు. పాకిస్తాన్ రాయబార కార్యాలయ సిబ్బంది డబ్బుతోపాటు అందమైన అమ్మాయిలను కలవడం వంటి ఆఫర్లతో ఆకర్షించబడ్డాడు. పాకిస్తాన్ కు మతపరమైన పర్యటన సందర్భంగా హనీట్రాప్ బాధితుడు ఇతడు. భారత సైనిక స్థావరాల గురించి సమాచారాన్ని పాకిస్తాన్ కు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
  • షాజాద్ – యూపీలోని మొరాదాబాద్ నుంచి అరెస్టు. ISI ఏజెంట్ల ద్వారా పాక్ ఎంబసీ అధికారులతో పరిచయం. వ్యాపారవేత్త ముసుగులో సులభమైన పాకిస్తానీ వీసా, డబ్బుకోసం గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.
  • హర్యానాలోని నుహ్ కు చెందిన అర్మాన్.. పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులు ఆసిఫ్ బిలోచ్, జాఫర్‌లు డబ్బు పాకిస్తాన్ వీసాతో అర్మాన్ ను ప్రలోభ పెట్టినట్లు గుర్తింపు.
  • నోమన్ ఇలాహి – యుపిలోని కైరానా నివాసి. హర్యానాలోని పానిపట్‌లో అరెస్టు చేశారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు అతన్ని కైరానాకు చెందిన ఉగ్రవాది ఇక్బాల్ కానాకు పరిచయం చేశారు. డబ్బు దురాశ కోసం యువతను ISI ఎజెండాతో అనుసంధానించే పని. పాకిస్తానీ ఏజెంట్లకు డబ్బు అందించే మధ్యవర్తి ఇతడు.
  • గజాలా- ఆమె పంజాబ్‌లోని మలేర్‌కోట్లాకు చెందినది. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉద్యోగి అయిన డానిష్, వితంతువు గజాలాను
  • వివాహం, ప్రేమ ఉచ్చులో బంధించి.. భారతదేశం అంతటా ఉన్న ISI ఏజెంట్లకు డబ్బు పంపించేవాడు.
  • యాసిన్ మొహమ్మద్- అతను పంజాబ్ లోని మాలెర్ కోట్లా నివాసి. పాక్ రాయబార కార్యాలయ అధికారి డానిష్ సూచనల మేరకు పాక్ వీసా కోరుకునే వ్యక్తులను గూఢచర్యం చేయడానికి ప్రేరేపించాడు.
  • మహ్మద్ తారిఫ్ – హర్యానాలోని నుహ్‌లో అరెస్టు అయ్యాడు. పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులు ఆసిఫ్ బిలోచ్, జాఫర్‌లు ఇచ్చే డబ్బు, పాకిస్తాన్ వీసాతో ఆకర్షితుడయ్యాడు.
  • పంచకుల నుంచి గుర్తు తెలియని మరో నిందితుడిని అరెస్టు చేశారు.
  • సుఖ్‌ప్రీత్ సింగ్- గురుదాస్‌పూర్ నుంచి అరెస్టు.
  • కరణ్‌బీర్ సింగ్- గురుదాస్‌పూర్ నుంచి అరెస్టు.
  • రకీబ్- పంజాబ్‌లోని బటిండాలో అరెస్టు.
  • పాలక్ షేర్ మాసిహ్- పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అరెస్టు
  • సూరజ్ మసీహ్- పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అరెస్టు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.