ఎయిమ్స్ ఓపీడీలో కలకలం.. వరుస గుండెపోటు మరణాలతో వైద్యుల ఆందోళన.. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థికి..

|

Dec 13, 2023 | 8:17 AM

సీపీఆర్‌, వెంటిలేటర్‌ చికిత్స అందించినా బతకలేదని వైద్యులు తెలిపారు. సోమవారం ఎయిమ్స్‌లో ఓపీడీ చికిత్స కోసం వచ్చిన ఓ రోగి క్యూలో నిలబడి కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రెండు గంటల్లోనే రెండు మరణాలు సంభవించాయి. ఈ ఘటన వైద్యులను కూడా ఆందోళనకు గురి చేసింది.

ఎయిమ్స్ ఓపీడీలో కలకలం..  వరుస గుండెపోటు మరణాలతో వైద్యుల ఆందోళన.. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థికి..
Gorakhpur Aims
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 26 ఏళ్ల వైద్య విద్యార్థి గుండెపోటుకు గురయ్యాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. ఎయిమ్స్ వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వెంటనే గమనించి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. బాధిత యువకుడు శశాంక్ ఎయిమ్స్‌లో ఫైనల్‌ ఇయర్‌ ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యాడు. మంగళవారం అతనికి యాంజియోగ్రఫీ నిర్వహించగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు. అయితే, అసలు ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

శశాంక్ శేఖర్ గోరఖ్‌పూర్ ఎయిమ్స్ 2019లో ఫస్ట్‌ ఇయర్ MBBS బ్యాచ్ విద్యార్థి. మెడికల్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఇతను సోమవారం హాస్టల్ గదిలో ఉండగా ఛాతిలో నొప్పితో ఇబ్బందిపడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి అతన్ని వెంటనే ఓపీడీకి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఈసీజీ చేయగా, గుండెపోటు వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఆయనను ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్పించాలని సూచించింది. ఫాతిమా ఆసుపత్రి డాక్టర్ లోకేష్ గుప్తా ఆధ్వర్యంలో విద్యార్థిని ఆరోగ్యం కోలుకుంది.

సోమవారం ఎయిమ్స్‌లో మరో ఇద్దరు రోగులు కూడా గుండెపోటుకు గురయ్యారు. సీపీఆర్‌, వెంటిలేటర్‌ చికిత్స అందించినా బతకలేదని వైద్యులు తెలిపారు. సోమవారం ఎయిమ్స్‌లో ఓపీడీ చికిత్స కోసం వచ్చిన ఓ రోగి క్యూలో నిలబడి కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రెండు గంటల్లోనే రెండు మరణాలు సంభవించాయి. ఈ ఘటన వైద్యులను కూడా ఆందోళనకు గురి చేసింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల యువతలో ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల దేశంలో గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశంలో యువతలో ఆకస్మిక మరణాల కేసులు పెరిగాయి. గుండెపోటు కేసులు పెరగడానికి గల కారణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహించిందని ఆరోగ్య మంత్రి ఇటీవల రాజ్యసభలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..