Viral: పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్ధి బిత్తర చూపులు.. ఏంటా అని చెక్ చేయగా

అచ్చం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మాదిరిగా పరీక్ష హాల్‌లో తనకు బదులు మరొక వ్యక్తితో పరీక్ష రాయించి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. పరీక్ష రాస్తున్న సమయంలో అధికారులకు దొరికిపోయి చిక్కుల్లో పడ్డాడు. చెన్నై నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Viral: పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్ధి బిత్తర చూపులు.. ఏంటా అని చెక్ చేయగా
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2024 | 1:40 PM

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో క్లర్కు పోస్టుకు తమిళనాడు వ్యాప్తంగా నవంబర్ 9న పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు హాజరయ్యి పరీక్షను రాశారు. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో అభ్యర్థి హాల్ టికెట్‌ను.. రాస్తున్న వ్యక్తిని పోల్చి చూడగా ఇన్విజిలేటర్‌కు షాక్ తగిలింది. మహేంద్ర ప్రభు అనే అభ్యర్థికి బదులు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి వచ్చి పరీక్ష రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన ఎగ్జామినర్.. అధికారులకు సమాచారం ఇచ్చాడు. తనది హర్యానా అని.. రూ. 3 లక్షలు ఇస్తానంటే.. మహేంద్ర ప్రభు బదులు పరీక్ష రాసేందుకు ఒప్పుకున్నానని అధికారుల ముందు నిజం ఒప్పుకున్నాడు ప్రవీణ్ కుమార్.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

దీంతో పరీక్ష హాల్‌లో ఉన్న అధికారులు చెన్నైలోని ముత్తపూడుపేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రవీణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేంద్ర ప్రభు యూపీకి చెందిన అభ్యర్థిగా పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. పరీక్ష హాల్‌లోకి చిన్న మొబైల్ ఫోన్‌తో పాటు ఒక మైక్రో డివైస్‌ను సైతం తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇదే తరహాలో ఇంకెవరైనా పరీక్ష రాశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది సైతం ఇదే తరహాలో ఒక ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2023లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరపున నిర్వహించిన పరీక్షకు ఒక విద్యార్థికి బదులు మరొక అభ్యర్థి వచ్చి పరీక్ష రాయడంతో గ్రేటర్ చెన్నై పోలీసులు సదరు 22 ఏళ్ల యువకుడిని గతంలో అరెస్టు చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో మరొక యువకుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్లర్క్ పరీక్ష కోసం వేరే యువకుడితో ఒప్పందం కుదుర్చుకుని పరీక్ష రాయించాడు. కాగా, మాల్ ప్రాక్టీస్ కింద ప్రవీణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..