Ganja: గంజాయి.. గంజాయి.. గంజాయి.. ఇప్పుడు ఎక్కడ బడితే అక్కడ ఈ మాయదారి మత్తు పట్టుబడుతూనే ఉంది. దేశవ్యాప్తంగా పోలీసులు, స్పెషల్ టీమ్స్ భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. దేశంలో యువత పెద్ద ఎత్తున గంజాయికి బానిసయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ మత్తు పదార్థాన్ని ఒకచోట నుంచి మరో చోటకి రవాణా చేసుకుందుకు స్మగ్లర్స్ చాలా నాక్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు అయితే మరీ బరి తెగించి.. ట్రైన్స్, బస్సుల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. తాజాగా కేరళ(Kerala)లోని కన్నూర్(kannur)లో ఓ యువకుడు అయితే ఏకంగా బైక్‌పైనే వెళ్లి గంజాయి, డ్రగ్స్ హోమ్ డెలివరీ చేస్తున్నాడు. వాహన తనిఖీల్లో అతని బాగోతం బయటపడింది. టౌన్ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీజిత్ కోడేరి తన టీమ్‌తో కలిసి గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే సాజిద్ సహదియాసి(26) అనే వ్యక్తి అటుగా వచ్చాడు. పోలీసులు ఆపగానే అతను కంగారుపడ్డాడు. పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతని బైక్‌లో సెర్స్ చేయగా.. కిలో గంజాయి, రెండు గ్రాముల ఎండీఎంఏ దొరికింది. దీంతో అతని అదుపులోకి తీసుకుని విచారించగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిశాయి. నగరంతో గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న ముఠాకు అతను సూత్రధారి అని తెలుసుకున్నారు. నిందితుడి గదిలో సోదాలు చేయగా… దాచి ఉంచిన గంజాయి ఆకులు, గంజాయి పూలు గుర్తించారు. డ్రగ్స్ రవాణాకు వినియోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..