దీదీకి కౌంట్‌డౌన్ మొదలైనట్టే.. టార్గెట్ ఫిక్స్ చేస్తున్న బీజేపీ

| Edited By: Ravi Kiran

Sep 28, 2019 | 6:12 AM

బెంగాల్‌లో దీదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. కోల్‌కతాలో జరిగిన జనజాగరణ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. మమతాకు దేశం కంటే అధికారమే ముఖ్యమని అందుకే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించాని ఆరోపించారు. ఆమెకు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యంగా మారాయంటూ నడ్డా మండిపడ్డారు. గత కొంత కాలంగా బెంగాల్‌ రాజకీయాలను, సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శల […]

దీదీకి కౌంట్‌డౌన్ మొదలైనట్టే.. టార్గెట్ ఫిక్స్ చేస్తున్న బీజేపీ
Follow us on

బెంగాల్‌లో దీదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. కోల్‌కతాలో జరిగిన జనజాగరణ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. మమతాకు దేశం కంటే అధికారమే ముఖ్యమని అందుకే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించాని ఆరోపించారు. ఆమెకు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యంగా మారాయంటూ నడ్డా మండిపడ్డారు.

గత కొంత కాలంగా బెంగాల్‌ రాజకీయాలను, సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శల జోరు పెంచుతోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వెస్ట్ బెంగాల్‌లో జెండా మోపాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే మమతాను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అసోంలో అమలు చేసిన ఎన్నార్సీని బెంగాల్‌లో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దీదీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ ఒకటో తేదీన కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఆయన హోం మంత్రిగా తొలిసారి బెంగాల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.