ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని ఉన్నావ్(Unnao) లో మరో దారుణం జరిగింది. అత్యంత ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతంగా అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఉన్నావ్ లో మరో దుర్ఘటన జరిగింది. నర్సుగా ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే ఓ యువతి ఆస్పత్రి గోడకు శవంగా వేలాడిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. న్యూజీవన్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఓ యువతి నర్సుగా ఉద్యోగంలో చేరింది. శనివారం ఉదయం ఆస్పత్రి గోడకు ఉన్న పిల్లర్ ఊచలకు తాడుతో వేలాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందిందిని నిర్థరించారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తమ కూతురిపై అత్యాచారం చేసి చంపేశారని ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామని శశిశేఖర్ సింగ్ వెల్లడించారు.
మహిళలపై ఎక్కువ నేరాలు జరిగే ప్రాంతంగా ఉన్నావ్‌కు పేరుంది. గతంలో ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌కు జైలు శిక్ష పడింది. అప్పట్లో కుల్దీప్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక తండ్రి మరణానికి కారణమయ్యాడని మరోసారి కేసు నమోదు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
APSRTC: ఆ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఏడు వేల మందికి ఎలక్ట్రిక్ వాహనాలు..!
Health Tips: అలివ్ ఆయిల్‌లో వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు