AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ప్రాణం బలి తీసుకున్న సహజీవనం.. లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ దారుణం.. ప్రియురాలిని చంపేసి 3 రోజుల పాటు..

ఒక యువకుడి ఇంట్లో మూడు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం దొరికిన ఇంట్లోని యువకుడు మృతురాలి ప్రియుడు, లివ్-ఇన్ పార్టనర్ అని స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. ఆ అమ్మాయి అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఒకే ఇంట్లో ఉంటుండగానే అతడు హత్యకు పాల్పడ్డాడు.  తన ప్రియురాలిని చంపిన తర్వాత అతడు మృతదేహాన్ని..

మరో ప్రాణం బలి తీసుకున్న సహజీవనం.. లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ దారుణం.. ప్రియురాలిని చంపేసి 3 రోజుల పాటు..
Bhopal man kills live-in partner
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2025 | 10:19 AM

Share

ఆగని హత్యలు యావత్‌ దేశాన్ని కుదిపివేస్తున్నాయి. వయసు బేధం లేకుండా పడనివారు ఎవరైనా సరే నిర్ధయగా చంపేసి హంతకులుగా మారుతున్నారు. హంతకుల్లో చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ అందరూ ఉంటున్నారు. తాజాగా మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సహజీవనం మరో యువతి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్‌లో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజధాని భోపాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక యువకుడి ఇంట్లో మూడు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం దొరికిన ఇంట్లోని యువకుడు మృతురాలి ప్రియుడు, లివ్-ఇన్ పార్టనర్ అని స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. ఆ అమ్మాయి అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఒకే ఇంట్లో ఉంటుండగానే అతడు హత్యకు పాల్పడ్డాడు.  తన ప్రియురాలిని చంపిన తర్వాత అతడు మృతదేహాన్ని బెడ్‌ షీట్‌లో చుట్టి పారిపోయాడు. సోమవారం రాత్రి హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హంతకుడు, మృతురాలి లివ్‌-ఇన్‌ పార్టనర్‌ అయిన సచిన్ రాజ్‌పుత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సచిన్ రాజ్‌పుత్ మద్యం మత్తులో ఉండగా తన ప్రియురాలు రితికను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు తన స్నేహితుల్లో ఒకరికి చెప్పాడు. అది విన్న స్నేహితుడు భయపడిపోయాడు. వెంటనే హత్య గురించి బజారియా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహంపై పంచనామా చేసిన తర్వాత మార్చురీకి తరలించారు. రితిక హత్యకు పాల్పడిన లివ్-ఇన్ పార్టనర్ సచిన్ రాజ్‌పుత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల సమాచారం ప్రకారం, వారిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కానీ, వారు కొన్ని నెలల క్రితమే లైవ్-ఇన్ ప్రారంభించారు. లైవ్-ఇన్ తర్వాత, సచిన్ రాజ్‌పుత్ రితికా సేన్‌ను అనుమానించడం ప్రారంభించాడు. ఆమె ఫోన్ వివరాలను సేకరించడం, ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఎవరికి కాల్ చేస్తుందో తెలుసుకోవడం ప్రారంభించాడు. రితికాకు ఎవరు ఫోన్ చేస్తున్నారో అన్ని వివరాలను సేకరించడం మొదలుపెట్టాడు.. ఈ విషయంపై వారిద్దరూ గతంలో కూడా గొడవ పడ్డారు. సమీపంలో నివసించే స్థానికుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వివరాల కోసం క్లిక్ చేయండి..

Follow Us
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?
వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?
జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..
జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!
రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!
రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!