న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఒకరి మైనపు బొమ్మ పెట్టడం అంటే అదో ప్రతిష్టాత్మక గౌరవంగా భావిస్తారు. ఇలాంటి అరుదైన అవకాశం ఇప్పటికే మహాత్మగాంధీ నుంచి మొదలుపెట్టి ఇందిర, మన్మోహన్‌సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు రాజకీయ నాయకీయ నాయకులకు దక్కింది. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్, బాలీవుడ్ లెజెండ్స్ షారుఖ్, సల్మాన్ ఖాన్ అలాగే టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్ లతోపాటు మరికొందరి మైనపు బొమ్మలు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడీ ఘనత యోగాగురు రాందేవ్‌కీ దక్కింది.
యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు అరుదైన గౌరవం. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో బాబా రామ్‌దేవ్ మైనపు బొమ్మ ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇలాంటి గౌరవం పొందిన తొలి భారతీయ సన్యాసిగా బాబా రామ్‌దేవ్ గుర్తింపు పొందారు. వృక్షాసన ముద్రలో రామ్‌దేవ్ మైనపు విగ్రహం కనిపించనుంది. ఈయన మైనపు విగ్రహాన్ని న్యూయార్క్‌తోపాటు ఢిల్లీ మ్యూజియంలో నిర్వాహకులు ఉంచనున్నారు.