Year Ender 2024: ప్రపంచ దేశాల మెప్పు పొందిన ప్రధాని మోదీ.. ఏడాది ఏయే దేశాల్లో పర్యటించారంటే..!

|

Dec 31, 2024 | 12:50 PM

మరికొద్ది క్షణాల్లో కొత్త సంవత్సరం అంటే 2025 రాబోతోంది. ఇక ఈఏడాది భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ దేశాభివృద్ధి, శ్రేయస్సు కోసం అనేక దేశాలను సందర్శించిన సంగతి తెలిసిందే. గత పదేళ్లలో ప్రధాని మోదీ ఇతర పాశ్చాత్య దేశాలకు అనేక ముఖ్యమైన పర్యటనలు చేస్తూనే, మధ్యప్రాచ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

Year Ender 2024: ప్రపంచ దేశాల మెప్పు పొందిన ప్రధాని మోదీ.. ఏడాది ఏయే దేశాల్లో పర్యటించారంటే..!
Pm Modi International Trips
Follow us on

2024 సంవత్సరం వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కొత్త అధ్యాయంతో మొదలవుతోంది. అదే సమయంలో, కొత్త సంవత్సరం దానితో కొత్త అంచనాలను తీసుకువస్తుంది. ఈ ఏడాది దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో పెద్ద సంఘటనలు జరిగాయి. అదే సమయంలో, భారతదేశం, ఇతర దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అనేక దేశాలకు వెళ్లారు.

ఈ ఏడాది దుబాయ్, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలను సందర్శించిన ప్రధాని మోదీ, బ్రూనై, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాల్లో సైతం పర్యటించారు. దీంతో పాటు అమెరికా, రష్యా వంటి శక్తివంతమైన దేశాలను కూడా ప్రధాని సందర్శించారు. ఇవే కాకుండా ప్రధాని మోదీ అనేక ఇతర దేశాలను కూడా సందర్శించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ విదేశీ పర్యటనల గురించి తెలుసుకుందాం.

ప్రధాని మోదీ 2024 ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ప్రధానమంత్రి యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మ‌హ్మద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ను కూడా ప్రధాని కలిశారు. ప్రధాన మంత్రి దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే సంద‌ర్భంలో ప్రధాన మంత్రి అబుదాబిలో నిర్మించిన మొట్టమొద‌టి హిందూ దేవాలయమైన BAPS ఆలయాన్ని ప్రారంభించారు. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఖతార్‌లో పర్యటించారు. ప్రధాని ఇక్కడ 2 రోజుల పర్యటనలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

ఈ ఏడాది జూన్‌లో మూడోవసారి ప్రధానమంత్రిగా భాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తన మొదటి విదేశీ పర్యటనలో ఇటలీకి బయలుదేరారు. ఇక్కడ ప్రపంచంలోని ఏడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో కూడిన దేశాల సమూహం G7 సమావేశంలో పాల్గొన్నారు. ఏడు సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్‌లతో పాటు యూరోపియన్ యూనియన్ ఈ సదస్సులో పాల్గొన్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రష్యాలోని మాస్కో చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో చాలా మంది రష్యన్ నాయకులు, సైనిక అధికారులు హాజరయ్యారు. మాస్కోలో అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల ఆస్ట్రియా పర్యటన నిమిత్తం మాస్కో నుంచి వియన్నా చేరుకున్నారు. వియన్నాలో, ప్రధానమంత్రి ప్రొఫెసర్ బిర్గిట్ కెల్నర్, డాక్టర్. మార్టిన్ జెనేస్లీ, డాక్టర్. కరిన్ ప్రీసెండాంజ్, డాక్టర్. బోరైన్ లారియోస్‌లను కలిశారు. వియన్నాలో జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు.

ప్రధాని ఈ ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు భారత్ మాతా కీ జై నినాదాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 1991 తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్రూనై సందర్శించారు, అక్కడ క్రౌన్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాది బిల్లా ఆయనకు విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. బ్రూనై రాజధాని బందర్ సేరి బెగవాన్‌లోని హోటల్‌లో భారతీయ కమ్యూనిటీ ప్రజలు కూడా ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ బ్రూనైలోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదుకు చేరుకున్నారు. ఇక్కడ ఆయన మసీదు చరిత్రకు సంబంధించిన వీడియోను కూడా వీక్షించారు. బందర్ సేరి బెగవాన్‌లో భారత హైకమిషన్ ఛాన్సరీని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు. సింగపూర్‌లో ప్రధాని మోదీకి ఇది ఐదోసారి. తన పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు. ప్రధాని వాంగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నంతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

సెప్టెంబరు నెలలో ప్రధాని మోదీ క్వాడ్ కాన్ఫరెన్స్ కోసం అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్ లీడర్‌ల నాలుగో సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆతిథ్యం ఇచ్చారు. పర్యటన తొలిరోజున, ప్రధాని ఫిలడెల్ఫియా చేరుకుని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ఆయన స్వగృహంలో కలిశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం లావోస్ చేరుకున్నారు. ఈ గ్రూపుల దేశాలతో సంబంధాలను మరింతగా పెంచుకోవడమే ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్ (లావో పీడీఆర్) ప్రధాని సోనెక్సా సిఫనాడన్ ఆహ్వానం మేరకు మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం వియంటియాన్ చేరుకున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్టోబర్ 22-23 తేదీల్లో రష్యాలో పర్యటించారు. ప్రధాని మోదీ రష్యాలోని కజాన్‌లో పర్యటించారు. రష్యా అధ్యక్షతన జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాలో పర్యటించారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఆయన నైజీరియాలో పర్యటిస్తున్నారు. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

నవంబర్‌లో బ్రెజిల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రజలు ప్రధాని మోదీకి సంస్కృత మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. బ్రెజిల్‌లో జరిగిన 19వ జి-20 శిఖరాగ్ర సమావేశంలో ‘ట్రొయికా’ సభ్యునిగా ప్రధాని మోదీ పాల్గొన్నారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారతదేశం G-20 ‘త్రయం’లో భాగం. ‘Troika’ ప్రస్తుత, మాజీ, తదుపరి G-20 అధ్యక్షులు పాల్గొన్నారు. అయితే ముగ్గురు సభ్యులు G-20 శిఖరాగ్ర సమావేశానికి సన్నాహకంగా పరస్పరం సహకరించుకుంటారు. చివరిగా ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ నెలలో గయానా చేరుకుని ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.

ఇక చివరిగా డిసెంబర్ నెలలో ప్రధాని మోదీకి కువైట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. కువైట్‌ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌ను మోదీకి ప్రదానం చేశారు. కువైట్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులతో సమావేశమయ్యారు. వాళ్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం దక్కింది. ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌ అవార్డును ప్రధాని మోదీకి కువైట్‌ రాజు షేక్‌ అల్‌ సబా ప్రదానం చేశారు. గతంలో బిల్‌ క్లింటన్‌ , జార్జ్‌ బుష్‌ ఈ అవార్డును స్వీకరించారు. బయాన్‌ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ గౌరవవందనం స్వీకరించారు. 43 ఏళ్లలో కువైట్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..