నేపాల్ నైట్‌క్లబ్‌లో రాహల్ గాంధీ మరో మహిళతో కనిపించిన వీడియోపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఫ్రెండ్ పెళ్లికి రాహుల్ వెళ్తే కొందరు రాద్దాతం చేయడం తగదని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ట్వీట్ చేశారు. రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరో తేల్చి చెప్పారు. ఆమె పేరు హౌ యాంక్వీ అని ప్రకటించారు. నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా ఆమె పనిచేస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి చర్చకు వచ్చాయని అభిప్రాయపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా ఆమె గతంలో నేపాల్‌లో చేసిన రాజకీయ ఎత్తుగడలను గుర్తు చేశారు. అంతేకాక, నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అనవసర విమర్శలు చేసిందనీ, ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేత వివాదంలో చిక్కుకున్నాడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Video of @RahulGandhi partying in a Nepal night club with Chinese diplomats is disturbing as China’s honey traps are rising. Hou Yanqi,Chinese Ambassador to Nepal also spotted with him.Congress unnecessarily questions @NarendraModi Ji’s Europe trip while its own leader does this!
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 3, 2022
విజయసాయి రెడ్డి ట్వీట్‌పై కాంగ్రెస్ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ట్వీట్‌పై కాంగ్రెస్ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు గాంధీ వెళ్లారు. హాజరుకావడంలో తప్పేముంది? అంటూ ప్రశ్నించారు.
Corrupt Vijayasai Reddy Pl see the truth . We know that your problem is the corruption cases against Jagan reddy for that you have to keep sahib happy .But dnt forget the truth. Mr Gandhi went to attend a wedding of the Nepal Ambassador daughter. What’s wrong in attending it ? pic.twitter.com/ueicImqhVY
— Manickam Tagore .B??✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 3, 2022
కాగా, ఇప్పటివరకు రక్షణ, అధికార యంత్రాంగాలలోని ముఖ్యులపైనే హనీట్రాప్ జరిగేది. తాజాగా రాహుల్ గాంధీపై ఈ ఆరోపణలు రావడంతో చైనా మనదేశ రాజకీయ నాయకులను అమ్మాయిలను ఎరగా వేసి లోబరుచుకుంటోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, హౌ యాంక్వీని జీ జిన్ పింగ్ ప్రత్యేకంగా హనీట్రాప్ కోసమే వాడుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈమె గతంలో ఎక్కడెక్కడ, ఏమేం చేసిందనే వివరాలను అంతర్జాతీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: PM Modi Visit: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ బిజీ బిజీ.. యూరఫ్ తర్వాత నేపాల్, జపాన్ సందర్శించే అవకాశం
Forbes List: అగ్రరాజ్యంలో సత్తా చాటిన జగిత్యాల వాసి.. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో చోటు..