ఇన్నాళ్లూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగింది. అనేకమంది ప్రముఖ టీఎంసీ నేతలు తమ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ తాజాగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ లో చేరి అందర్నీ ఆశ్చర్య పరిచారు. 83 ఏళ్ళ ఈయన 2018 లో బీజేపీని వీడారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను విమర్శిస్తూ వస్తున్నారు. 1990 లో నాటి ప్రధాని చంద్రశేఖర్ హయాంలో ఆర్ధిక మంత్రిగా , ఆ తరువాత 1998-2002 సమయంలో అప్పటి ప్రధాని దివంగత వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఆయన వివిధ పదవులు నిర్వహించారు. ముఖ్యంగా 2004 వరకు విదేశాంగ మంత్రిగా కీలక పదవిలో ఉన్నారు. యశ్వంత్ సిన్హా శనివారం కోల్ కతా లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు డెరెక్ , సుదీప్ బందోపాధ్యాయ, సుబ్రతా ముఖర్జీ సమక్షంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
యశ్వంత్ సిన్హా వంటి సీనియర్ నేత తమ పార్టీలో చేరడం తమకు గర్వ కారణమని సుబ్రతా ముఖర్జీ పేర్కొన్నారు. అటు సిన్హా కుమారుడు జయంత్ సిన్హా బీజేపీ ఎంపీ. ప్రధాని మోదీ తొలి ప్రభుత్వ హయాంలో (2014-19) ఆయన పౌరవిమానయాన, ఆర్ధిక శాఖల సహాయ మంత్రిగా వ్యవహరించారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఈయన విజయం సాధించినా ఆయనకు ఇంకా ఎలాంటి పోస్టింగును ఇవ్వలేదు. ఇలా ఉండగా ఈ తరుణంలో యశ్వంత్ సిన్హా టీఎంసీ లో చేరడం బెంగాల్ పాలక పార్టీకి ప్రయోజనకరమా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఎమ్మెల్సీ
తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, పార్టీ ఉత్తేజితమయ్యేనా ?