AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yasin Malik Verdict: యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు.. కోర్టు తీర్పు సందర్భంగా కశ్మీర్‌లోయలో బంద్‌..

తీర్పు సందర్భంగా మాలిక్ కోర్టు హాలులో ఉన్నారు. యాసిన్ మాలిక్‌పై తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా కోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు, ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ..

Yasin Malik Verdict: యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు.. కోర్టు తీర్పు సందర్భంగా కశ్మీర్‌లోయలో బంద్‌..
Yasin Malik
Sanjay Kasula
|

Updated on: May 25, 2022 | 6:24 PM

Share

ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా తేలిన వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మాలిక్ కోర్టు హాలులో ఉన్నారు. యాసిన్ మాలిక్‌పై తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా కోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు, ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని అభ్యర్థించింది. మరోవైపు చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (UAPA) కింద చేసిన ఆరోపణలతో సహా తనపై వచ్చిన అన్ని ఆరోపణలను మాలిక్ అంగీకరించారు.టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో కాశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌కు జీవితఖైదు విధించింది పాటియాలా హౌస్‌ కోర్టు . టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో యాసిన్‌మాలిక్‌ను దోషిగా తేల్చింది ఎన్‌ఐఏ కోర్టు. కశ్మీర్‌ వేర్పాటు ఉగ్రవాదం కేసులో కీలక సూత్రధారి యాసిన్‌ మాలిక్‌. వేర్పాటువాదుల్ని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. డు. ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో యాసిన్‌ మాలిక్‌ సిద్ధహస్తుడని ఎన్‌ఐఏ విచారణలో తేలింది. కోర్టు తీర్పు సందర్భంగా ఢిల్లీతో పాటు కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాసిన్‌మాలిక్‌పై కోర్టు తీర్పు సందర్భంగా కశ్మీర్‌లోయలో బంద్‌ పాటిస్తున్నారు. శ్రీనగర్‌లో సంపూర్ణ బంద్‌ జరుగుతోంది. అయితే తాను ఉగ్రవాదానికి దూరంగా ఉన్నానని , గాంధేయమార్గంలో పోరాటం చేస్తునట్టు తెలిపారు యాసిన్‌మాలిక్‌. అయితే యాసిన్‌మాలిక్‌కు మద్దతుగా పాకిస్తాన్‌ నేతలు , ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. యాసిన్‌మాలిక్‌పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారని ట్వీట్‌ చేశారు పాక్‌ మాజీ క్రికెట్‌ షాహిద్‌ అఫ్రిదీ. పాక్‌ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు అఫ్రిదీ.