IPL 2023: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన యశస్వి జైశ్వాల్

|

May 20, 2023 | 4:08 AM

పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. అయితే రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ.. బెంగళూరు, ముంబయి ఓడితేనే ప్లేఆఫ్స్‌లోని నాలుగో బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంటుంది.

IPL 2023: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన యశస్వి జైశ్వాల్
Yashasvi Jaiswal
Follow us on

పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. అయితే రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ.. బెంగళూరు, ముంబయి ఓడితేనే ప్లేఆఫ్స్‌లోని నాలుగో బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 21 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న జైశ్వాల్‌.. మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన యశస్వి.. సీజన్‌లో 600 ప్లస్‌ పరుగులు మార్క్‌ను సాధించాడు.

ఒక సీజన్‌లో 600 పరుగుల మార్క్‌ అందుకున్న తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ యశస్వి చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరపున యశస్వి ఒక్కడే ఈ ఘనత సాధించడం విశేషం. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన జైశ్వాల్‌ 625 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 600ప్లస్‌ పరుగులు నమోదు చేసిన రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్‌(21 ఏళ్ల 142 రోజులుల) నిలిచాడు. తొలి స్థానంలో రిషబ్‌ పంత్‌(20 ఏళ్ల 226 రోజులు), విరాట్‌ కోహ్లి(24 ఏళ్ల 193 రోజులు) మూడో స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..