Yaas Cyclone Effect: ‘యాస్’ తుపాను ముంచుకొస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారీ తుఫాను ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. ముఖ్యంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించింది బెంగాల్ ప్రభుత్వం. తుపాన్ వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలోని విమానాశ్రయాన్ని బుధవారం మూసివేశారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం వల్ల విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినందున ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కోల్‌కతా విమానాశ్రయ అధికారులు ట్వీట్ చేశారు.
#FlyAI: #YaasCyclone Alert!
Kolkata airport will be closed for operations from 0830 to 1945 hrs (IST) on 26th May, 2021 due to Cyclone Yaas. There will be no flights operating to/from Kolkata.
— Air India (@airindiain) May 25, 2021
యాస్ తుపాన్ వల్ల విమాన సర్వీసులను రద్దు చేసినందున టికెట్లు బుక్ చేసుకున్న విమాన ప్రయాణికులకు రిఫండ్ చేస్తామని ఇండిగో ట్వీట్ చేసింది. తుపాన్ ముప్పు వల్ల కోల్‌కతా కేంద్రంగా 38 రైళ్లను రద్దు చేశామని భారత రైల్వే అధికారులు చెప్పారు. మే 24 నుంచి మే 29వతేదీ వరకు రైళ్ల రద్దు వల్ల ముందుగా టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు తిరిగి డబ్బులు చెల్లిస్తామని రైల్వే అధికారులు చెప్పారు.ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 13 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు రాష్ట్ర బృందాలు సహాయకచర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు.