వరకట్నం చట్టాల్లో మార్పులు చేయండి.. సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య!

అక్రమమార్గంలో డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ కొందరు పెళ్లి పేరిట వేధింపులకు తెగబడుతున్నారు. సాధారణంగా పురుషులు అదనపు కట్నం కోసం భార్యను, ఆమె పుట్టింటి వారిని నానాఅగచాట్లు పెడుతున్న సంఘటనలు నిత్యం మన చుట్టూ ఎన్నో చూస్తూనే ఉన్నాం. కానీ దీనిని ఆసరాగా చేసుకుని ఓ కిలాడీ లేడీ ఓ యువకుడిని పెళ్లి చేసుకుని, తనన కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు పెట్టింది. తనకు డబ్బు చెల్లిస్తే కేసు ఉపసంహరించుకుంటానని బ్లాక్ మెయిల్ కు దిగింది. ఈ క్రమంలో..

వరకట్నం చట్టాల్లో మార్పులు చేయండి.. సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య!
Man Dies By Suicide

Updated on: Jan 31, 2025 | 11:25 AM

ఇండోర్‌, జనవరి 31: మహిళల సంరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను కొందరు మిస్‌యూజ్‌ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ భార్యామణి తన భర్తపై వరకట్నం వేధింపులు కేసు పెట్టడంతో.. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న నిషేధ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని, వెంటనే వాటిని మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. వీటిని అడ్డు పెట్టుకుని తన భర్య వేధింపులు తట్టుకోలేక మరణిస్తున్నానని సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి మరణించాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ నితిన్‌ పడియార్‌ (28)పై అతని భార్య రాజస్థాన్‌లో ఇటీవల వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. దీంతో తీవ్రమనస్తాపం చెందిన నితిన్‌ జనవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గదిలో లభించిన సూసైడ్‌ నోట్‌లో పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావించాడు. తన భార్య రాజస్థాన్‌లో అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, ఆమె తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి కేసును ఉపసంహరించుకోవడానికి డబ్బు డిమాండ్ చేశారని అందులో తెలిపాడు. తన భార్య పెట్టిన తప్పుడు కేసుల వల్ల తీవ్ర అన్యాయానికి గురవుతున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం దానిని మార్చాలని ప్రభుత్వాన్ని కోరాడు.

మహిళా చట్టాలను మార్చకపోతే, ప్రతిరోజూ తన మాదిరిగానే ఎంతో మంది పురుషులు, వారి కుటుంబాలు నాశనమవుతాయని విజ్ఞప్తి చేశాడు. దేశంలోని యువత ఎవ్వరూ పెళ్లి చేసుకోవద్దని సూసైడ్‌లో పిలుపునిచ్చాడు. ఒక వేళ మీరూ వివాహం చేసుకుంటే, తన మాదిరిగానే బెదిరింపులకు గురౌతారని యువతకు సందేశం ఇచ్చినట్లు బంగంగా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సియారామ్ గుర్జార్ మీడియాకు తెలిపారు. దీంతో మృతుడి భార్య, ఆమె తల్లి, ఆమె ఇద్దరు సోదరిలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.