బంధువులను కలుసుకునేందుకు వెళ్లి 18 ఏళ్ల పాటు పాక్‌ జైల్లో గడిపి.. భారత్‌కు వచ్చిన హసీనాబేగం కన్నుమూత

|

Feb 11, 2021 | 7:30 AM

భర్త తరపున తన బంధువులను కలుసుకునేందుకు వెళ్లి పాక్ లో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష  అనుభవించిన తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు..

బంధువులను కలుసుకునేందుకు వెళ్లి 18 ఏళ్ల పాటు పాక్‌ జైల్లో గడిపి.. భారత్‌కు వచ్చిన హసీనాబేగం కన్నుమూత
Follow us on

భర్త తరపున తన బంధువులను కలుసుకునేందుకు వెళ్లి పాక్ లో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష  అనుభవించిన తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు. పాస్‌పోర్టు పోగొట్టుకోవడంతో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఔరంగాబాద్‌ పోలీసుల సహకారంతో 2021, జనవరి 26న మంగళవారం స్వస్థలానికి చేరుకుంది. అయితే ఈనెల 9న గుండెపోటుతో ఆమె మరణించారు. మంగళవారం ఉదయం ఛాతినొప్పులతో బాధపడుతుండటంతో బంధువులు వైద్యుడిని పిలిపించి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, ఆమె అప్పటికే కన్నుమూసింది.

కొన్నేళ్ల కిందట ఆమె తన బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్‌కు వెళ్లింది. పాస్‌ పోర్టును పోగొట్టుకోవడంతో ఇబ్బందుల్లో పడిపోయింది. ఆమె భారతీయురాలని నిరూపించే తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఆమె పాక్‌ జైల్లో ఉండిపోయింది. ఆమె అదృశ్యం అయినట్లు బంధువులు గౌరంగాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. చివరకు ఆమె లాహోర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిసింది. ఆమె భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఔరంగాబాద్‌ పోలీసులు సహకరించారు.

అయితే 2000లో తన ఇంటిని ఎవరో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలుసుకున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇల్లు తన పేరే ఉందని నిరూపించే పేపర్లను సమర్పించారు. దీని ఆధారంగా పోలీసులు ఆమె భారతీయురాలని రుజువు చేసి పాక్ జైలు నుంచి విడిపించారు. ఔరంగాబాద్‌కు చెందిన హసీనా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

Also Read: Voter Id Card Corrections: మీ ఓటర్ కార్డులో పేరు, అడ్రస్ తప్పుగా ఉన్నాయా ? అయితే సులభంగా మార్చేసుకోండిలా..