Voter Id Card Corrections: మీ ఓటర్ కార్డులో పేరు, అడ్రస్ తప్పుగా ఉన్నాయా ? అయితే సులభంగా మార్చేసుకోండిలా..

మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆధార్, పాన్ కార్డుకు మనకు ఎంత ముఖ్యమో.. ఓటర్ కార్డు కూడా అంతే ముఖ్యం.

Voter Id Card Corrections: మీ ఓటర్ కార్డులో పేరు, అడ్రస్ తప్పుగా ఉన్నాయా ? అయితే సులభంగా మార్చేసుకోండిలా..
Follow us

|

Updated on: Feb 11, 2021 | 7:16 AM

మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆధార్, పాన్ కార్డుకు మనకు ఎంత ముఖ్యమో.. ఓటర్ కార్డు కూడా అంతే ముఖ్యం. ఓటు హక్కు ఉందా ? లేదా ? అనేది దీనిమీదే ఆధారపడి ఉంటుంది. ఇక ఈ ఓటర్ కార్డులో తప్పులు ఉండడం సహజం. పేరు, అడ్రస్ లేదా పుట్టిన తేదీలు ఇలా తప్పులు ఉంటాయి. ఇక వాటిని మార్చుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుండేది. తాజాగా ఓటర్ కార్డులోని తప్పులను మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. సులభంగా ఆ‏న్లైన్‏లోనే ఈ పనిని చేసుకోవచ్చు. అదేలానో ఇప్పుడు చూద్దాం.

ఓటర్ కార్డులోని తప్పులు మార్చుకోవాలంటే ముందుగా ఎలక్షన్ కమిషన్ వెబ్‏సైట్ ఓపెన్ చేయాలి. మీ పేరు, వివరాలతో రిజస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే మీ యూజర్ నేమ్, పాస్‏వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీకు ఎడమ వైపున కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది మూడో ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అనంతరం మీ రాష్ట్రం, జిల్లా, నియోజకర్గం వివరాలను సెలక్ట్ చేసుకోవాలి. ఇక మీ ఓటర్ కార్డులో ఏవైతే తప్పులు ఉన్నాయో.. వాటిని సరిదిద్దుకోండి. అయితే ఇందు కోసం ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్‏లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఓక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దాని సాయంతో మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Also Read: ఆధార్ కార్డుకు పాన్ కార్డు అనుసంధానం ఎలా చేయాలి.? 2 నిమిషాల్లో లింక్ చేసుకొండి ఇలా..