Crime: దారుణం.. కూతురు కంటే ఎక్కువ మార్కులొచ్చాయని ఘాతుకం.. స్కూల్ టాపర్‌‌ను చంపిన తల్లి..

|

Sep 04, 2022 | 11:59 AM

కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌- మాలతి దంపతుల రెండో కుమారుడు మణికంఠన్‌ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ లో 8వ తరగతి చదువుతున్నాడు.

Crime: దారుణం.. కూతురు కంటే ఎక్కువ మార్కులొచ్చాయని ఘాతుకం.. స్కూల్ టాపర్‌‌ను చంపిన తల్లి..
Crime News
Follow us on

Woman killed student: పుదుచ్చేరిలో దారుణం జరిగింది. తన కూతురి కంటే ఓ విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఏకంగా హత్య చేయించింది ఓ స్టూడెంట్‌ తల్లి. కూల్‌డ్రింక్‌లో విషం ఇచ్చి బాలుడిని కడతేర్చింది. ఈ ఘటన పుదుచ్చేరిలో సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ క్రైమ్‌ స్టోరీ వెలుగులోకి వచ్చింది. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌- మాలతి దంపతుల రెండో కుమారుడు మణికంఠన్‌ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే, స్కూలుకు వెళ్లొచ్చిన తర్వాత వాంతులు చేసుకుని, కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. మణికందన్‌ను కారైకల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కూల్‌ డ్రింక్‌లో విష పదార్థాలు ఉన్నాయని తేలడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ టీవీ కెమెరాను పరిశీలించిన అనంతరం అసలు కథ బయటపడింది. విక్టోరియా అనే మహిళ ఈ విష ప్రయోగానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. తన కూతురి కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయనే అక్కసుతో ఈ దారుణానికి పాల్పడిందని.. పోలీసుల విచారణలో తేలింది. స్కూల్‌లో ఉండే వాచ్‌మెన్‌ ద్వారా మణికందన్‌కు విషంతో ఉన్న కూల్‌డ్రింగ్‌ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. తన కొడుకు క్లాస్‌ ఫస్ట్‌ రాకపోవడానికి మణికందన్‌ కారణమని భావించి ఈ ఘాతుకానికి పాల్పడింద్నారు. దీంతో నిందితురాలు సహాయరాణి విక్టోరియాను కారైకాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, పోలీస్టేషన్‌కు తరలించారు.

అయితే.. ఉదయం 11:00 గంటల సమయంలో విద్యార్థి బయటకు రాగా.. డ్యూటీలో ఉన్న వాచ్‌మెన్ తో బాల మణికందన్‌కు కూల్ డ్రింక్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాల మణికందన్ తన కూతురు కంటే బాగా చదువుతున్నాడని, ప్రస్తుత పరీక్షలో క్లాస్ ఫస్ట్ రావడంతో ఈ దారుణానికి పాల్పడిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..