హృదయాన్ని కదిలించిన ఓ తల్లి ఆరాటం.. మృత్యువులోనూ బిడ్డ చెయ్యి గట్టిగా పట్టుకొని..!

|

Aug 01, 2024 | 5:04 PM

ఉత్తరాదిన వర్షం భీభత్సం సృష్టిస్తుంది. దేశ రాజధాని ఢాల్లీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అల్లకల్లోలం సృస్టిస్తు్న్నాయి. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో బిక్కుబిక్కుమంటూ జనాలు ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఎటునుంచి ఏ ఆపద వస్తుందో తెలియక అల్లాడిపోతున్నారు. ఇటీవల ఢిల్లీలో ముగ్గురు సివిల్స్‌ సర్వీస్‌ ఆశావహులు వరద నీటికి బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సంఘటన చోటు..

హృదయాన్ని కదిలించిన ఓ తల్లి ఆరాటం.. మృత్యువులోనూ బిడ్డ చెయ్యి గట్టిగా పట్టుకొని..!
Rain In Delhi
Follow us on

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఉత్తరాదిన వర్షం భీభత్సం సృష్టిస్తుంది. దేశ రాజధాని ఢాల్లీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అల్లకల్లోలం సృస్టిస్తు్న్నాయి. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో బిక్కుబిక్కుమంటూ జనాలు ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఎటునుంచి ఏ ఆపద వస్తుందో తెలియక అల్లాడిపోతున్నారు. ఇటీవల ఢిల్లీలో ముగ్గురు సివిల్స్‌ సర్వీస్‌ ఆశావహులు వరద నీటికి బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో బుధవారం కురిసిన భారీ వర్షాల ధాటికి మూడేళ్లు కూడా నిండని ఓ పసివాడు తల్లితో సహా ప్రాణాలు కోల్పోయాడు. రోడ్లపై నోళ్లు తెరచిన డ్రైనేజీ వీరి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకెళ్తే..

ఢిల్లీకి చెందిన తనూజ బిష్త్‌, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రియాంష్‌ తీసుకుని ఘాజీపూర్ ప్రాంతంలోని ఖోడా కాలనీ సమీపంలోని వారపు సంతకు కూరగాయలు కొనేందుకు వెళ్లింది. వారు ఇంటికి తిరిగివస్తుండగా వర్షం ప్రారంభమైంది. భారీ వాన కురవడంతో రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. దాంతో రోడ్డుపై నిర్మాణంలో ఉన్న కాలువను గమనించని తనూజ, అందులో కాలేసింది. అంతే కుమారుడితో సహా దానిలోకి జారిపోయారు. ఈ ఘటన రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఇది జరిగిన 2 గంటల తర్వాత 500 మీటర్ల దూరంలో వారు విగతజీవులుగా కనిపించారు. అయితే మృతిచెందిన ఆ తల్లిబిడ్లల దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టుకున్నారు. మృత్యువు ముంచుకొచ్చిన కన్నబిడ్డను చేజారనీయకుండా కుమారుడి చేతిని గట్టిగా పట్టుకుందా తల్లి. మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. చేతులు పట్టుకుని నీళ్లలో తేలియాడుతూ కనిపించిన తల్లిబిడ్డలను చూసిన ప్రతి ఒక్కరి మనస్సు కళుక్కుమంది. క్రేన్ల సహాయంతో తల్లిబిడ్డను బయటకు తీసుకువచ్చి, అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం వీరి మరణవార్తను తనూజ కుటుంబ సభ్యులకు చేరవేశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక యంత్రాంగం నిర్లక్ష్య వల్లే తనూజ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఉంటే వారు బతికేవారని వాపోయారు.

ఇవి కూడా చదవండి

దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. మాకు రాత్రి 7.30 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేశాం. పోలీసులు, సహాయక సిబ్బంది వచ్చినప్పటికీ.. వారివద్ద తగిన పరికరాలు లేకపోవడంతో జాప్యం చోటు చేసుకుంది. రెండు గంటల తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారు. బతికుంటారేమోననే చిన్న ఆశతో వారిని ఆసుపత్రికి తరలించాం. కానీ అప్పటికే ఆలస్యమైంది. మరణంలోనూ ఆమె తన కుమారుడి చేయిని పట్టుకొనే ఉందని ఆయన తెలిపారు. కాగా బుధవారం కురిసిన వర్షాలకు 9 మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ రోజు అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.