Tamil Nadu: తమిళనాడు రాజధాని చెన్నై నగర శివార్లలోని పమ్మల్‌లో విషాదం చోటు చేసుకుంది. బొగ్గుల కుంపటి ఓ మహిళ ప్రాణాలను హరించింది. ఏసీ రూమ్‌లో దోమలు చనిపోవడానికి వేసిన పోగ కారణంగా మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకెళితే.. తిరువళ్లూరు నగర్‌లో పుష్పలక్ష్మి, సొక్కలింగం దంపతులు నివసిస్తున్నారు. అయితే, వీరు నివసిస్తున్న ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో వాటిని తరమడానికి ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టారు. అందులో నూనె వేసి పొగ పెట్టారు. అనంతరం నిద్రపోయారు. అయితే, వారు ఉన్న గదిలో ఏసీ కూడా ఉండటంతో పొగ బాగా కమ్ముకుంది. దాంతో వారంతా నిద్రలోనే స్పృహ కోల్పోయారు. ఉదయం తెల్లవారినప్పటికీ వీరు లేవకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
కిటికీలోంచి చూడగా.. అందరూ పడుకుని ఉన్నారు. ఎంత లేపినా లేవకపోవడంతో.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. గది అంతా ఒక రకమైన వాసన రావడంతో వారిని పరిశీలించారు. పుష్పలక్ష్మిని చూడగా.. ఆవిడ అప్పటికే మృతి చెందింది. భర్త సొక్కలింగంతో పాటు.. కూతురు, కొడుకు ఊపిరి ఆడుతున్నప్పటికీ.. స్పృహలోకి రావడం లేదు. దాంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Contract Lecturers: కాంట్రాక్ట్ లెక్చర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..
Diabetes: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయా..? పరిశోధకులు ఏమంటున్నారు..?
Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..