School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు!

|

Jan 06, 2025 | 4:03 PM

School Holidays: దేశంలో పలు ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రతరం అవుతున్నాయి. ఢిల్లీలో సహా ఇతర రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు. చలి కారణంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు..

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు!
Follow us on

ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ప్రస్తుతం చలి తీవ్రతలో ఉన్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో చలిగాలులతో పాటు దట్టమైన పొగమంచు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు రాష్ట్రాల్లో శీతాకాల సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు జనవరి 6, 2025 నుండి ఓపెన్‌ కానుండగా, చలి తీవ్రత దృష్ట్యా సెలవులను పొడిగించాయి. చలిగాలుల దృష్ట్యా జనవరి 7-13 నుండి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రమైంది. హర్యానా, పంజాబ్‌లలో చాలా చోట్ల చలి తీవ్రత పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీని కారణంగా అనేక విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగా గత మూడు రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌లలో పాఠశాలలు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో చలి తీవ్రత కారణంగా 8వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే నోయిడాలో ఇంకా అలాంటి ఆర్డర్ ఇవ్వలేదు.

బీహార్‌లోని పలు జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్‌వాడీ స్కూళ్లతో పాటు 8వ తరగతి వరకు తరగతులను జనవరి 11 వరకు మూసివేయాలని పాట్నా డిఎం చంద్రశేఖర్ సింగ్ నోటీసు జారీ చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు వేళల్లో మార్పులు చేశారు. 9 నుండి 12 వరకు అన్ని తరగతులు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతాయి. పాట్నా మాత్రమే కాదు, బీహార్‌లోని అనేక ఇతర జిల్లాల్లోని పాఠశాలలు కూడా జనవరి 11 వరకు మూసివేయనున్నారు. వీటిలో ముజఫర్‌పూర్, మోతిహారి, సివాన్, ముంగేర్, షేక్‌పురా, సరన్, బెట్టియా వంటి అనేక జిల్లాలు ఉన్నాయి.

యూపీలోని చాలా ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, కాన్పూర్, నోయిడా, ఆగ్రా, మధుర, వారణాసితో సహా చాలా నగరాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. IMD జారీ చేసిన హెచ్చరిక ప్రకారం, రాబోయే రోజుల్లో యుపీలో చలిగాలులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జనవరి 9 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విపరీతమైన చలి దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు జనవరి 9 వరకు సెలవులు పొడిగిస్తూ జిల్లా కలెక్టర్ డా.అమిత్ యాదవ్ ఆదేశించారు. అలాగే అజ్మీర్‌లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

 


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి