CM Mamata Vs Suvendu : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయాలు హాట్‌హాట్ గా మారాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతుండగా.. తాజాగా బీజేపీ నేత దీదీకి ఓ సవాల్ విసిరి సంచలనం సృష్టించాడు. నందిగ్రామ్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది సేపటికే.. బీజేపీ నేత సువేందు అధికారి తనదైన శైలిలో స్పందించారు. నందిగ్రామ్‌లో ఆమెను 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానంలో దీదీ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
రానున్న ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడించకుంటే తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. టీఎంసీ పార్టీ కాదని.. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. అని సువేందు ఎద్దేవా చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతకు భవానీపూర్‌లో గెలుస్తాననే నమ్మకం లేదని..అందుకనే నందిగ్రామ్ నుంచి పోటీకి దిగుతున్నారని అన్నారు.
సువేందు అధికార పార్టీ టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సువేందుకు గట్టి పట్టున్న నందిగ్రామ్ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించడంతో రాజకీయ చిత్రం ఆసక్తికరంగా మారింది. సవాల్ ప్రతిసవాల్ గా సాగుతుంది.
Also Read: తవ్వకాల్లో 3వేల ఏళ్ల నాటి శవపేటిక, ఆలయం, మాస్క్ లు, ఆటవస్తులు చరిత్రను తిరగరాస్తాయా..!