దేశ రాజధానిలో సందడి మొదలైంది. రాష్ట్రపతి ఎవరనేది హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలంతా ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలైతే మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతలా ఎన్నడూ లేదంటే ఆశ్చర్యం అవసరం లేదు. అయితే తాజాగా ఓ సెంటిమెంటు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకూ 13 మంది ఉప రాష్ట్రపతులుగా చేస్తే.. వారిలో తొలి ముగ్గురు రాష్ట్రపతి అయ్యారు. మలి ముగ్గురూ కాలేదు. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురూ అయ్యారు. మళ్లీ ముగ్గురు కాలేదు. ఇలా గతంలో ఉప రాష్ట్రపతులుగా పనిచేసిన వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, జాకీర్ హుస్సేన్, డాక్టర్ శంకర్‌దయాళ్‌శర్మ, కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు. ఆ కోవలోనే ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అవుతారా..? లేదా.. అనే ఉత్కంఠ అందరిలో.. ముఖ్యంగా తెలుగువారిలో నెలకొంది.
ఉపరాష్ట్రపతులు.. రాష్ట్రపతులుగా..
ఉపరాష్ట్రపతులుగా ఉన్నవారంతా ఎంపికయ్యారు.. ఈ నేపథ్యంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మకు ముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆర్ వెంకట్రామన్ ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆ తర్వాత జాకీర్ హుస్సేన్, ఆ తర్వాత వి.వి. గిరి, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్ వరుసగా రాష్ట్రపతులుగా ఎంపికైనవారే ఇలాంటి ఓ సెంటిమెంట్‌ను తెలుగు ప్రజలు వినిపిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం ఈసారి ఛాన్స్ తెలుగు తేజం వెంకయ్యనాయుడు రావొచ్చని ఓ అంచన నడుస్తోంది.
ఇదే సమయంలో మహిళలను తేవాలనుకుంటే మాత్రం దక్షిణాది నుంచి ఎవరినైనా తీసుకురావొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసైల పేర్లూ ప్రచారంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పేర్లను, విశ్లేషణలను బీజేపీ మంత్రులుగానీ, సీనియర్ నేతలుగానీ ధ్రువీకరించడం లేదు. అధికారికంగా ప్రకటించేంతవరకూ ఎవరి పేరునూ పరిగణనలోకి తీసుకోకూడదని వారు అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజల కోరికను బీజేపీ పెద్దలు గుర్తిస్తారా..? లేదా? అనే ఉత్కంఠ తెలుగువారిలో నెలకొంది. మరో ముగ్గురు నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే డ్రాగన్ కంట్రీ చైనాను అడ్డుకోవాలంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి ఒకరిని రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నల్గుగా తెలుస్తోంది.
ఏది ఏమైనా తెలుగు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బీజేపీ పెద్దలు అడుగు వేస్తారా? లేదంటే మరో కోణంలో ఆలోచించి ఇతర నిర్ణయమేదైనా తీసుకుంటారా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడక తప్పదు.