ఇండిగోలో కంగనా ప్రయాణం. మీడియా అత్యుత్సాహం, డీజీసీఏ ఆగ్రహం

| Edited By: Anil kumar poka

Sep 12, 2020 | 5:32 PM

ఇటీవల చండీ గఢ్ నుంచి ముంబైకి కంగనా రనౌత్  ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు సేఫ్టీ రూల్స్ , భౌతిక దూరం  వంటివాటిని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్...

ఇండిగోలో కంగనా ప్రయాణం. మీడియా అత్యుత్సాహం, డీజీసీఏ ఆగ్రహం
Follow us on

ఇటీవల చండీ గఢ్ నుంచి ముంబైకి కంగనా రనౌత్  ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు సేఫ్టీ రూల్స్ , భౌతిక దూరం  వంటివాటిని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) మండిపడింది. ఇండిగో ఎయిర్ లైన్స్ సీఈఓ కి తీవ్ర పదజాలంతో లేఖను రాస్తూ.. నాడు అలా రూల్స్ ని అతిక్రమించినవారిపై ఎలాంటి చర్య తీసుకున్నారో 15 రోజుల్లోగా రిపోర్టు సమర్పించాలని, లేని పక్షంలో కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించింది.  ఇకపై ఏ దేశీయ ఎయిర్ లైన్స్ లో నైనా ఇలా జరిగితే రెండు వారాలపాటు వాటి సర్వీసును నిలిపివేస్తామని కూడా పేర్కొంది. విమానాల్లో ఫోటోలు తీయడం ఎయిర్ క్రాఫ్ట్ రూల్-13 ప్రకారం నిషిధ్ధమని  అధికారులు స్పష్టం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించకపోవడం వంటివాటిని అనుమతించే ప్రసక్తే లేదని వారు తెలిపారు. ఈ నెల 9 న కంగనా ప్రయాణించిన ఇండిగో విమానంలో ఆమె వెంట ఉన్న మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు తోసుకుంటూ ఆమె కూర్చున్న సీటు వద్దకు రావడాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఈ విధమైన ఘటనలో దేశీయ విమాన సర్వీసుల్లో ఎప్పుడు జరిగినా  రెండు వారాలపాటు సంబంధిత సర్వీసును నిలిపివేయడం ఖాయమని వార్ణింగ్ ఇచ్చింది.