Video: బెడ్‌పై భార్య పైశాచికత్వం..! రహస్య కెమెరాలో రికార్డ్‌ చేసిన భర్త

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఒక భర్త తన భార్య యొక్క క్రూరమైన దాడులను రహస్య కెమెరాతో రికార్డ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు కోసం భర్తను నిరంతరం వేధించే భార్య, తరచుగా దాడి చేసేది. భార్య హింసను తట్టుకోలేక, భర్త ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: బెడ్‌పై భార్య పైశాచికత్వం..! రహస్య కెమెరాలో రికార్డ్‌ చేసిన భర్త
Wife Beating Husband

Updated on: Apr 03, 2025 | 4:49 PM

ఓ భార్య చాలా పైశాచికంగా, క్రూరంగా ప్రవర్తించింది. ఆమె అలా చేస్తున్న విషయం బయటికి చెప్తే.. ఈ సమాజం నమ్ముతుందో లేదో అని ఓ భర్త కెమెరాలను నమ్ముకున్నాడు. తనపై ప్రతి రోజు తన భార్య జరుపుతున్న హింసను ఎలాగైనా బయటపెట్టాలని తన బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరా పెట్టాడు. ఎప్పటిలానే తన ఆ భార్య తన భర్తపై బెడ్‌ మీద హింసించడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాలన్ని ఆ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఆ వీడియో తీసుకొని.. భర్త నేరుగా వెళ్లి పోలీసులకు చూపించాడు. దాంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయి.. వామ్మో ఈమె మామూలు ఆడది కాదంటూ ఆమెపై కేసు నమోదు చేశారు.

ఇంతకీ ఆ భార్య ఎలా వేధించింది, ఎందుకు హింసింది అనే విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఇద్దరు దంపతులు కాపురం ఉంటున్నారు. కాగా, ఆ భార్యకు డబ్బు పిచ్చి, డబ్బు, బంగారం, వెండి ఇవ్వాలంటూ తరచూ భర్తను వేధించేది. చాలా సార్లు తన తల్లి సమక్షంలోనే దాడి కూడా చేసేది. తన భార్య చేస్తున్న హింసను తట్టుకోలేకపోయిన అతను రహస్య కెమెరాలు పెట్టి, తన భార్య నిజ స్వరూపం, తనను ఎలా కొట్టి హింసిస్తుందో ఈ సమాజానికి తెలిసేలా చేశారు. తన భార్య ఈ విధంగా తనను శారీరంగా వేధిస్తోందంటూ ఆ వీడియో చూపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఆ మహిళ తన భర్తపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన మార్చి 20న జరిగినట్లు తెలుస్తోంది. లోకేష్ చేతులు జోడించి దయ కోసం వేడుకుంటుండగా, అతని భార్య అతనిని పలుసార్లు చెంపదెబ్బ కొట్టడం చూడవచ్చు. ఈ సంఘటన తర్వాత, లోకేష్ సత్నా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 2023 జూన్‌లో హర్షిత రైక్వార్‌ను వివాహం చేసుకున్నానని లోకేష్ వెల్లడించాడు. అయితే, వివాహం జరిగిన వెంటనే, అతని భార్య, అత్తగారు, బావమరిది డబ్బు, బంగారు-వెండి నగలు డిమాండ్ చేయడం ప్రారంభించారని పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.