Chandrayaan-3: ప్రపంచం చూపు భారత్ వైపు.. మూడు మాడ్యూల్స్‌లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. ఆసక్తికర విషయాలు మీకోసం..

ISRO Chandrayaan-3: భారత్‌ ఒక్కటే కాదు చంద్రయాన్‌ 3 ప్రయోగం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇస్రో సక్సెస్‌ రేటుకు తోడు భారతీయ శాస్త్రవేత్తల పరిజ్ఞానం.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే తిరుగులేని శక్తిగా మార్చింది.

Chandrayaan-3: ప్రపంచం చూపు భారత్ వైపు.. మూడు మాడ్యూల్స్‌లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. ఆసక్తికర విషయాలు మీకోసం..
Chandrayaan-3

Updated on: Jul 13, 2023 | 10:03 PM

ISRO Chandrayaan-3: భారత్‌ ఒక్కటే కాదు చంద్రయాన్‌ 3 ప్రయోగం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇస్రో సక్సెస్‌ రేటుకు తోడు భారతీయ శాస్త్రవేత్తల పరిజ్ఞానం.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే తిరుగులేని శక్తిగా మార్చింది. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను మోసుకెళ్లే చంద్రయాన్‌ 3 ఎలా ఉండబోతోంది. LVM–3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై నింగికెగరనున్న చంద్రయాన్‌ 3తో చంద్రుడి పుట్టుకకు సంబంధించి అనేక విషయాలు వెలుగుచూడనున్నాయి.

చంద్రయాన్‌ సిరీస్‌లో ఇదో మూడో ప్రయోగం. LVM 3-ఎం4 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో అనుసంధానించారు. సుమారు36,500కిమీల గరిష్ట దూరంలోకి వెళ్తూ, చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది.

మూడు మాడ్యూల్స్‌లో చంద్రయాన్‌-3

ప్రయోగంలో ఉన్న మూడు మాడ్యూల్స్‌.. మూడు రకాలుగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌: రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్‌ ఇది. ఈ మాడ్యూల్‌.. రాకెట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరవుతుంది.

ల్యాండర్‌ మాడ్యూల్‌: చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత అసలైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. నిర్ణీత సుదూర కక్ష్య నుంచి చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్‌ దిగుతుంది. అనంతరం రోవర్‌ బయటకు వస్తుంది.

రోవర్‌: చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరం. ఇది చంద్రుడి పై ఉన్న మట్టి, మంచు, వాతవరణ పరిస్థితులను పరిశీలించి.. అక్కడి సమాచారాన్ని భూమికి పంపుతుంది. ఈ రోవర్‌ జీవితకాలం 14 రోజులు మాత్రమే.. అందులోని పరికరాలు వాతావరణంలో ప్లాస్మా ఆయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత, నీటి జాడలను గుర్తిస్తాయి.

చంద్రయాన్‌–3లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో రెండు పేలోడ్స్, ల్యాండర్‌లో 4 పేలోడ్స్, రోవర్‌లో రెండు పేలోడ్స్, అమెరికాకు చెందిన ఒక పేలోడ్‌ను అమర్చి పంపిస్తున్నారు. చంద్రయాన్‌–3 ద్వారా చందమామ రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా.. అక్కడికి వ్యోమగాములను పంపించి.. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు సైతం ప్రారంభమయ్యే అవకాశం వుంది.

ఆసక్తికరంగా.. చంద్రయాన్ ప్రయోగం

అంతకుముందు.. నాసా చేసిన ప్రయోగం అతి తక్కువగా రోజుల్లోనే పూర్తవగా.. ఇస్రో చేస్తున్న ప్రయోగం కొంచెం ఆలస్యం కానుంది. 40 రోజుల తర్వాత చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకొంటుంది. రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ.. అత్యంత సమీపంగా 170 కిమీ, అత్యంత దూరంగా 36,500 కిమీ కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అనంతరం భూ కక్ష్యను వదిలి రాకెట్ చందమామ వైపు ప్రయాణిస్తుంది. ఇది చంద్రుడిని చేరుకునేందుకు 40 రోజులు పట్టనుంది. అయితే, చంద్రయాన్‌-3 విజయవంతం అయితే.. ప్రపంచంలో విజయవంతం చేసిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం..