12 ఏళ్ళు పైబడిన పిల్లలకూ మాస్క్ అవసరమే, ప్రపంచ ఆరోగ్య సంస్థ

12 ఏళ్ళు పైబడిన పిల్లలు కూడా పెద్దల మాదిరే మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కోవిడ్ నివారణకు ఇది తప్పనిసరి అని పేర్కొంది. అలాగే వారూ ఒక మీటర్ వరకు..

12 ఏళ్ళు పైబడిన పిల్లలకూ మాస్క్ అవసరమే, ప్రపంచ ఆరోగ్య సంస్థ

Edited By:

Updated on: Aug 23, 2020 | 1:57 PM

12 ఏళ్ళు పైబడిన పిల్లలు కూడా పెద్దల మాదిరే మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కోవిడ్ నివారణకు ఇది తప్పనిసరి అని పేర్కొంది. అలాగే వారూ ఒక మీటర్ వరకు భౌతిక దూరం పాటించాలని కూడా కోరింది. ఈ సంస్థతో బాటు యునిసెఫ్ కూడా తమ వెబ్ సైట్ లో ఈ విషయాన్ని వివరిస్తూ.. వైరస్ వ్యాప్తిలో పిల్లల పాత్ర, వారి నిరోధక శక్తిపై సమగ్ర అధ్యయనం జరగాలని అభిప్రాయపడింది. 6-11 ఏళ్ళ మధ్య వయసున్న బాలలు వారి వాతావరణం, ఆరోగ్య పరిస్థితులను బట్టి మాస్కులు ధరించవచ్చు..అయితే ఈ విషయంలో పెద్దల పర్యవేక్షణ చాలా ముఖ్యం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వర్గాలు వివరించాయి.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు పబ్లిక్ లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 5 న ప్రకటించింది. అయితే పిల్లలకు సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ నీ ప్రకటించలేదు.  ఇప్పుడు తాజాగా ఈ మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది.