Arogya Setu app: కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసలు కురిపించింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో ఈ యాప్ బాగా పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. కరోనా కేసులను గుర్తించడంలో మొబైల్ అప్లికేషన్ వంటి డిజిటల్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
”ఆరోగ్య సేతు యాప్‌ని 15కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖలకు ఆ యాప్ చాలా సాయపడుతోంది. దాని వలన విస్తృత కరోనా పరీక్షల నిర్వహణ సులభతరం అవుతోంది” అని టెడ్రోస్ ప్రశంసలు కురిపించారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల దగ్గరకు వెళ్లినప్పుడు బ్లూటూత్, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా ఆరోగ్య సేతు అప్రమత్తం చేస్తుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో కేసుల తీవ్రతను కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు.
Read More: