ఆపరేషన్‌ సిందూర్‌..! ఈ పేరు ఎవరు పెట్టారు? దాని వెనకున్న అర్థమేంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఇండియా "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసింది. పహల్గామ్ దాడిలో హిందువులను లక్ష్యంగా చేసుకున్నందుకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఆపరేషన్ సిందూర్ అనే ఈ పేరు ఎవరు పెట్టారు. ఎందుకు పెట్టారు అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపరేషన్‌ సిందూర్‌..! ఈ పేరు ఎవరు పెట్టారు? దాని వెనకున్న అర్థమేంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Operation Sindoor

Updated on: May 07, 2025 | 7:25 PM

ఆపరేషన్ సిందూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌‌పై భారత్ క్షిపణి దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే 1.44 గంటలకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పత్రిక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్‌ క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. అర్ధరాత్రి రక్షణ మంత్రిత్వ శాఖ ఆపరేషన్‌ సిందూర్‌ అని ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన తర్వాత.. అది క్షణాల్లోనే వైరల్‌ అయిపోయింది.

ఇంగ్లిష్‌లో రాసిన అక్షరాల్లో ”SINDOOR”లో ఒక ‘O’లో కుంకుమతో నిండిన గిన్నె ఉంది. మరో ‘O’ చుట్టూ చెల్లాచెదురుగా కుంకుమ పడి ఉండటం మనం చూడొచ్చు. ఆ పోస్టునే భారతీయులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు, వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను అంతమొందించేందుకు చేపట్టిన ఈ సైనిక చర్యకు.. ఆపరేషన్‌ సిందూర్‌ అనే ఎందుకు పెట్టారని చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే.. దీని వెనుక ఒక పరామార్థం ఉంది. అదేంటంటే.. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయంలో తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారంతా పురుషులే. పైగా ఎక్కువ మంది హిందువులు. సాధారణంగా హిందూ మత ఆచారాల ప్రకారం భారత్‌లో మహిళలు సిందూరాన్ని పవిత్రంగా భావిస్తారు. పెళ్లయిన మహిళలు పాపిట్లో సిందూరం పెట్టుకుంటారు.

భర్త మరణిస్తే.. వితంతుగా మారి సిందూరం పెట్టుకోరు. అయితే.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో పిల్లలు, మహిళలను వదిలేసిన ఉగ్రవాదులు.. కేవలం పురుషులనే చంపేశారు. దాంతో చనిపోయిన వ్యక్తుల భార్యలు వింతతువులు అయ్యారు. దీంతో వారికి న్యాయం చేయాలని, వారికి ఎంతో పవిత్రమైన సిందూరం చూసిన వారిని వేటాడేందుకు చేస్తున్న ఆపరేషన్‌కు “ఆపరేషన్‌ సిందూర్‌” అని పెట్టడమే సరైందని ఆ పేరు పెట్టినట్లు సమాచారం. మరో విశేషం ఏంటంటే.. ఆ పేరును స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే సూచించినట్లు తెలుస్తోంది. మన అక్కాచెళ్లెమ్మల నుదిట సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి