
రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ సంచలన హత్య కేసులో లేటెస్ట్‌గా మరో పేరు తెరపైకొచ్చింది. సోనమ్ ఫోన్ నుండి లభించిన ఆధారాల ప్రకారం సంజయ్ వర్మ అనే మరో వ్యక్తి గురించి పోలీసులు కీలక నిజాలు బయటపెట్టారు. సోనమ్‌కు సంజయ్‌తో ఉన్న సంబంధంపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో.. ఆ వ్యక్తి మరెవరో కాదని, రాజా రఘువంశీ హత్యకు పథకం వేసిన సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహానే అని మేఘాలయ పోలీసులు వెల్లడించారు.
రాజ్ పేరును సోనమ్ సంజయ్ వర్మగా ఫీడ్ చేసుకుని… పెళ్లికి ముందు 39 రోజుల వ్యవధిలో ఏకంగా 234 సార్లు కాల్ చేసిందని వెల్లడించారు. అంతేకాదు… ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదుసార్లు కనీసం 30 నుంచి 60 నిమిషాలు మాట్లాడుకునేవారని కాల్ రికార్డులు చూపించారు పోలీసులు. ఓ పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్… రాజ్ నంబర్‌ను సంజయ్ వర్మ అని సేవ్ చేసుకుందన్నారు.
ఇక మే 11న రాజా రఘువంశీ, సోనమ్ వివాహం జరగ్గా… సరిగ్గా నెలరోజులకు జూన్ 11న సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. ఇక ఈ మర్డర్ కేసులో సోనమ్‌తో మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..